మొగుడు కంటే ప్రియుడు ముద్దంటూ.. ఆతర్వాత ఏమైంది?

NRI Women left husband and attempt suicide in Vijayawada

11:51 AM ON 24th June, 2016 By Mirchi Vilas

NRI Women left husband and attempt suicide in Vijayawada

భర్తను వదిలి ప్రియుడికోసం ఖండాంతరాలు దాటివచ్చిందో వివాహిత. తీరావచ్చాక ప్రియుడు పత్తాలేకుండా పోవడంతో ప్రాణాలు తీసుకునేందుకు సిద్దపడింది. వివరాల్లోకి వెళ్తే, మానస భర్తతో కలిసి అమెరికాలో నివశిస్తోంది. ఈ క్రమంలో విజయవాడకు చెందిన హేమంత్ రెడ్డి, మానసను ఇండియాకు వచ్చేయాలంటూ ప్రోత్సహించాడు. వచ్చిన వెంటనే పెళ్లిచేసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అవి నమ్మిన మానస విజయవాడకు వచ్చింది.

కృష్ణా జిల్లా వెంకటాపురానికి చెందిన బీ టెక్ విద్యార్థిని వణుకూరి మానసకు గత ఏడాది సెప్టెంబరులో ఎన్నారై ప్రభాకర్ తో వివాహమైంది. సుమారు 20 రోజులక్రితం భర్తతో కలిసి అమెరికా వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్ళాక కూడా ప్రియుడు హేమంత్ ని మరిచిపోలేకపోయింది. తాను హేమంత్ ను ప్రేమించానని భర్తతో చెప్పింది. అమెరికా నుంచే ప్రియుడి పేరెంట్స్ తో మాట్లాడి తాను ఇండియాకు వచ్చేస్తానని చెప్పడంతో వాళ్ళు అంగీకరించారు. ఈ క్రమంలో మానసను ఆమె భర్త ప్రభాకర్ కూడా పుట్టింటికి పంపాడు.

అయితే విజయవాడ వచ్చేస్తే పెళ్లిచేసుకుంటానని చెప్పిన ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తాలేకుండా పోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. ఇక మానస ను తల్లిదండ్రులుకూడా ఇంటికి రావద్దన్నారు. విధిలేని పరిస్థితుల్లో బంధువుల ఇంట్లో ఉన్న మానస అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలాఉంటే, కట్నం ఇస్తేనే పెళ్లంటూ హేమంత్ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

ఆత్మహత్యా యత్నం చేసి ఆసుపత్రిలో చేరిన ఆమెను హేమంత్ వెళ్లి పరామర్శించాడు. తనను పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చాడు. దీంతో మానస పొంగిపోయింది. ఇక మానస, హేమంత్ ల వివాహానికి శుభం కార్డు పడినట్టే అని అంటున్నారు. మొత్తానికి మానస కథ సుఖాంతమైందని చెప్పవచ్చు.

ఇది కూడా చూడండి: మరణానికి ముందు యమధర్మరాజు పంపే 4 సూచనలు ఇవే

ఇది కూడా చూడండి: వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి: హెచ్‌ఐవి లక్షణాలు

English summary

NRI Women left husband and attempt suicide in Vijayawada.