ఎన్ఆర్ఐలు ఇండియాలో ఇల్లు కొనొచ్చు

NRIs can purchase any house in India

10:10 AM ON 10th February, 2016 By Mirchi Vilas

NRIs can purchase any house in India

ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు) భారతదేశంలో ఇల్లు కొనుక్కోవచ్చని వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. ఢిల్లీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు రేష్మా భగత్‌, ఆమె కుమారుడు తరుణ్‌ భగత్‌ దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ సందర్భంగా జస్టిస్‌ జె.ఎం.మాలిక్‌ నేతృత్వంలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌

(ఎన్‌సీడీఆర్‌సీ) ఈ వ్యాఖ్యలు చేసింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నొయిడాలో ఫిర్యాదుదారులకు ఇల్లు అమ్మేందుకు నిరాకరించిన సూపర్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థను రూ.63.99 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2008లో

సూపర్‌టెక్‌కు చెందిన ప్రాజెక్టులో ఓ ఇల్లును రేష్మా, తరుణ్‌ బుక్‌చేసుకున్నారు. 2009లో వారికి ఇల్లు అప్పగించాల్సి ఉన్నా ఆనాటికి నిర్మాణపు పనులను సూపర్‌టెక్‌ పూర్తిచేయలేదు. ఆ ఇంటిని ఓ ఎన్‌ఆర్‌ఐ పేరిట బుక్‌ చేశారని, దానిలో వారు నివాసముండరని సంస్థ ఆరోపించింది. కేవలం దానిపై లాభం అర్జించేందుకే దాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. అందుకే ఇంటి పనులు పూర్తిచేయలేదని వెల్లడించింది. సంస్థ వాదనను కమిషన్‌ తిరస్కరించింది.

English summary

NRI's, who return to the country "every now and then", can purchase a house in India, the apex consumer commission has said while asking Supertech Ltd to pay around Rs 64 lakh to an NRI for denying possession of a flat in Greater Noida in Uttar Pradesh.