నోట్ల మార్పిడిలో ఎన్ ఆర్ ఐ లకు ఆఫర్

NRI's got nice offer in notes exchanging

11:41 AM ON 2nd January, 2017 By Mirchi Vilas

NRI's got nice offer in notes exchanging
రద్దయిన పెద్దనోట్ల మార్పిడికి సంబంధించి డిసెంబర్ 30తో బ్యాంకు లలో జమచేయడం పూర్తికాగా, మార్చి 31లోగా రిజర్వ్ బ్యాంకు లో తగిన ఆధారాలు చూపించి మార్చుకోవచ్చు. అయితే ఎన్ ఆర్ ఐ లకు మాత్రం మంచి ఆఫర్ ఇస్తూ, భారత రిజర్వు బ్యాంకు తాజా ప్రకటన చేసింది. విదేశీ పర్యటనల్లో ఉండి పెద్దనోట్ల రద్దు ప్రకటన అమల్లోకి వచ్చిన 2016 నవంబరు 9 నుంచీ గడువుగా నిర్ధారించిన డిసెంబరు 30వ తేదీలోగా మార్చుకోలేకపోయిన భారతీయులు 2017 మార్చి 31వ తేదీలోగా వాటిని మార్చుకోవచ్చు. అయితే, ప్రవాస భారతీయులైతే 2017 జూన్ 30 వ తేదీ వరకూ మార్చుకోవచ్చని ఆర్ బీఐ తెలిపింది.

అర్హులైన భారత్ లో ఉంటున్న వారి విషయానికి వస్తే...మార్పిడికి సంబంధించి ఎలాంటి పరిమితులూ విధించలేదు. అదే, ఎన్ ఆర్ ఐలైతే మాత్రం ఫెమా నిబంధనల మేరకు పరిమితిని పాటించాల్సి ఉంటుంది. ఈ కేటగిరీల్లోకి వచ్చే వారంతా గుర్తింపు పత్రాలు, ఆ వ్యవధిలో తాము విదేశీ పర్యటనలో ఉన్నట్లు ధృవీకరించే పత్రాలను సమర్పించాలి. అంతకు ముందు పాతనోట్ల మార్పిడి వసతిని వినియోగించుకోలేదని కూడా స్పష్టం చేయాల్సి ఉంటుందని ఆర్ బీఐ ప్రకటన తెలిపింది. ఇందుకు సంబంధించిన అన్ని నిబంధనలకు లోబడి మాత్రమే ఈ వసతిని వినియోగించుకోవచ్చని ఆర్ బీఐ స్పష్టం చేసింది. ముంబయి, దిల్లీ, చెన్నై, కోల్ కతా, నాగపూర్ లలోని భారత రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లో మాత్రమే ఈ వసతి అమల్లో ఉంటుంది. నేపాల్ , భూటాన్ , పాకిస్థాన్ , బంగ్లాదేశ్ లలో ఉంటున్న భారతపౌరులు ఈ వసతి వర్తించదని కూడా ఆర్ బీఐ తెలిపింది.

ఇది కూడా చూడండి: ఈ దేశాలకు విసా లేకుండా వెళ్ళచ్చు తెలుసా

ఇది కూడా చూడండి: మీరు పుట్టిన నెలతో మీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవచ్చు

ఇది కూడా చూడండి: చంద్రబాబుపై మెగా అభిమానుల భగ్గు భగ్గు

English summary

NRI's got nice opportunity in the exchange of Notes.Time got expanded for them to exchange their Notes.