ఎన్టీఆర్‌ కి ఘనంగా నివాళి

NTR 20th Death Anniversary

01:26 PM ON 18th January, 2016 By Mirchi Vilas

NTR 20th Death Anniversary

తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నటరత్న ఎన్టిఆర్ వర్ధంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టిఆర్ ఘాట్ కి పార్టీ నేతలు , ఎన్టిఆర్ కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా ఎన్టిఆర్ ఘాట్ లో నివాళులర్పిస్తూ, మరపురాని మనీషి ఎన్టిఆర్ అని కీర్తించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్టిఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

బాలయ్య నివాళి ......

'తెలుగువారి ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు ఎన్టీఆర్‌' అని నందమూరి బాలకృష్ణ రసూల్‌పురాలోని విగ్రహం వద్ద నివాళులర్పించారు. శాంతి కపోతాలు ఎగురవేసి, అమర్‌ జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ ఏకచక్రాధిపత్యానికి చరమగీతం పాడింది ఎన్టీఆరే అని అన్నారు. ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకునే తెదేపాను నడిపిస్తున్నట్లు తెలిపారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి లేని ప్రజాదరణ తెదేపా ఉందని బాలకృష్ణ అన్నారు.

భువనేశ్వరి - లోకేష్ నివాళి .....

ఎన్టిఆర్ ఘాట్ లో ఎన్టిఆర్ కి టిడిపి అధినేత - ఎపి సిఎమ్ చంద్రబాబు సతీమణి , ఎన్టిఆర్ కుమార్తె నారా భువనేశ్వరి , కొడుకు నారా లోకేష్ , కోడలు నారా బ్రాహ్మణి తదితరులు నివాళులర్పించారు.

హరికృష్ణ - జూనియర్ నివాళి

ఎన్టిఆర్ కుమారుడు హరికృష్ణ , తనయులు జూనియర్ ఎన్ టి ఆర్ , కళ్యాణ్ రామ్ తదితరులు సోమవారం ఉదయం ఎన్ టి ఆర్ ఘాట్ లో ఎన్ టి ఆర్ కి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి కీర్త పతాక ఎగురవేసిన ఎన్టిఆర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు.

పురందేశ్వరి నివాళి .....

'తెలుగువారికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌' అని ప్రకాశం జిల్లా కారంచేడులోని చిన్న వంతెన కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన కుమార్తె, మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజమే దేవాలయం - ప్రజలే నా దేవుళ్లు అంటూ ఎన్టీఆర్‌ పేద ప్రజల కోసమే నిరంతరం పరితపించారని ఆమె గుర్తుచేశారు.

English summary

Today was the death aniverssary of Telugu Desam Party founder Ex- Cheif Minister Of Andhra Pradesh Nandamuri Taraka Rama Rao.Today his family members and some of the celebrities tributed to NTR in NTR ghat