ఎవరి నాన్నతో వారికి అటాచ్ మెంట్ గుర్తొచ్చిందా !

NTR About Nannaku Prematho In MEK

12:11 PM ON 18th January, 2016 By Mirchi Vilas

NTR About Nannaku Prematho In MEK

అవునట.. నాన్నకు ప్రేమతో కధ విన్నప్పుడు , సినిమా తీస్తున్నప్పుడు కూడా యూనిట్ లో అందరికీ ఎవరి నాన్నతో వారి ఎటాచ్మెంట్ గుర్తొచ్చిందట. ఇది సాక్షాత్తూ జూనియర్ చెప్పాడు. అదే ఎన్టిఆర్ చెప్పాడు. నాగార్జున నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' రియాల్టీ షో లో జూనియర్ ఈ విషయం చెప్పాడు. ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం మా టివిలో ప్రసారమైంది. 'నాకు , దర్శకుడు సుకుమార్ కి , సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి , నిర్మాత ప్రసాద్ కి ,చివరకు ఫోటోగ్రఫీ తీసే కెమెరామెన్ కి కూడా ఎవరి నాన్నతో వారి అనుబంధం గుర్తొచ్చింది. ఇది నిజంగా మిరాకిల్.

ఇక పెద్ద ఎన్టిఆర్ కి సంభందించిన డైలాగులు వాడరాదని కూడా జూనియర్ గట్టిగా నిర్ణయించుకున్నాడట. 'రామయ్య వస్తావయ్య' సినిమాలో ఓ డైలాగ్ వాడాను. ఇక అప్పటి నుంచి ఇక వాడకూడదని నిర్ణయించుకున్నాను' అని జూనియర్ చెప్పాడు. అంతేకాదు పెద్ద ఎన్టిఆర్ నిజంగా దేవుడని కూడా కీర్తించాడు.

English summary

Recently Junior NTR participated in nagurjuna's tv reality show Meelo Evaru Koteeswarudu in tha program NTR speaks About Nannaku Prematho movie