ఎన్టీఆర్-అల్లు అర్జున్ లతో బోయపాటి మల్టీ స్టారర్!

Ntr and Allu Arjun in single movie

05:56 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Ntr and Allu Arjun in single movie

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే తాజా చిత్రంలో అల్లు అర్జున్-ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారు.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో వీళ్లిద్దరూ గెస్ట్ రోల్స్ ప్లే చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. కథలో మంచి గ్రిప్ ఉన్నప్పటికీ సినిమాకు హైప్ క్రియేట్ అవ్వాలంటే వీళ్లద్దరూ సినిమాలో కనిపించాల్సిందేనని బోయపాటి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గెస్ట్ రోల్స్ కి అనుగుణంగా స్ర్కిప్ట్ లో మార్పులు.. చేర్పులు చేస్తున్నాడట బోయపాటి. గెస్ట్ రోల్ చేయనున్న ఇద్దరు హీరోల పేర్లను బోయపాటి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాడని సమాచారం.

కాగా, ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేశారు. జూలైలో సినిమా ప్రారంభించాలని భావిస్తున్నారు. అభిషేక్ ఫిల్మ్స్ ఈ చిత్రాని నిర్మిస్తుంది.

English summary

Ntr and Allu Arjun in single movie