ఎన్టీఆర్,బన్నీ లతో మల్టీ స్టారర్!

NTR And Allu Arjun To Act Together

11:30 AM ON 26th May, 2016 By Mirchi Vilas

NTR And Allu Arjun To Act Together

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్ మీదున్న ఇద్దరు హీరోల పేర్లు చెప్పమంటే, అల్లు అర్జున్- ఎన్టిఆర్ ల పేర్లు తప్పనిసరిగా చెప్పేస్తారు. వీరిద్దరికీ ఫాన్ ఫాలోయింగ్ కూడా బానే వుంది. ఇక వీరిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. అయితే అది వీరిద్దరి ఫుల్ లెన్త్ సినిమా మాత్రం కాదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో వీళ్లిద్దరూ గెస్ట్ రోల్స్ ప్లే చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. కథలో పట్టున్నప్పటికీ సినిమాకు హైప్ క్రియేట్ అవ్వాలంటే వీళ్లద్దరూ సినిమాలో కనిపించాల్సిందేనని బోయపాటి డిసైడ్ అయ్యాడట.

ప్రస్తుతం ఈ గెస్ట్ రోల్స్ కి అనుగుణంగా స్ర్కిప్ట్ లో బోయపాటి మార్పులు..చేర్పులు చేస్తున్నాడట . గెస్ట్ రోల్ చేయనున్న ఈ ఇద్దరు హీరోల పేర్లను బోయపాటి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాడని అంటున్నారు. కాగా, ఈ సినిమాలో బెల్లంకొండ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ని ఫైనల్ చేసారట. అభిషేక్ ఫిల్మ్స్ నిర్మాణంలో జులైలో సినిమా ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:సమంతకు కాబోయే అత్త-మామలు వార్నింగ్

ఇవి కూడా చదవండి:హాట్ ఫోజ్ తో మత్తెక్కిస్తున్న అమీ జాక్సన్

English summary

Young Tiger NTR and Stylish NTR to act in a multi starrer movie under the direction of director Boyapati Srinu. Presently Boyapati Srinu was making a movie with Allu Srinu Movie fame Bellamkonda Srinivas and Boyapati Srinu was thinking to get more hype to the film .