ఇజం ఆడియో వేడుకలో నాన్నకు ప్రేమతో

Ntr and Harikrishna in Isam audio launch

01:31 PM ON 6th October, 2016 By Mirchi Vilas

Ntr and Harikrishna in Isam audio launch

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఇజమ్ సినిమా ఆడియో వేడుక హైదరాబాద్ లో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్ లో తండ్రి నందమూరి హరికృష్ణతో జూనియర్ ఎన్టీఆర్ సరదాగా ముచ్చటించారు. తొలుత నాన్నను జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి, ఆ తర్వాత సంభాషణ ప్రారంభించారు. తండ్రి ఎదురుగా కింద కాళ్లపై కూర్చుని ఆప్యాయంగా ఎన్టీఆర్ మాట్లాడాడు. ఆ సమయంలో హరికృష్ణ తన రెండు చేతులతో ఎన్టీఆర్ బుగ్గలు తడిమి ముద్దు చేశారు. తండ్రీ కొడుకులు ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి కెమెరాలు ఆ దృశ్యాన్ని క్లిక్ మనిపించాయి.

English summary

Ntr and Harikrishna in Isam audio launch