'గుండమ్మ కధ' రీమేక్ లో చైతూ-ఎన్టీఆర్

Ntr and Naga Chaitanya in Savitri biopic movie

04:03 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Ntr and Naga Chaitanya in Savitri biopic movie

నాగ చైతన్య-ఎన్టీఆర్ కలిసి మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతుంది. మహానటి సావిత్రి గాథని వెండి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న విషయంతెలిసిందే. 'సావిత్రి' పాత్రలో నిత్యామీనన్ కనిపించనున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. స్క్రిప్ట్ పనులు పూర్తి కావచ్చాయి. ప్రస్తుతం మిగిలిన పాత్రలకు వెతుకులాట సాగుతోంది. సావిత్రి కథ అంటే ఎన్టీఆర్, అక్కినేని ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో సావిత్రికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ దిగ్గజాలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది మహా నటి సావిత్రి.

ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్, అక్కినేని పాత్రలు వున్నాయి. అందులో ఎవరు కనిపిస్తే బాగుంటుంది అనే విషయంలో యూనిట్ సభ్యులు తర్జన భర్జనలు పడుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని పాత్రకు నాగ చైతన్యలను తీసుకుంటే బాగుంటుందని అశ్వనీదత్ భావిస్తున్నాడట. ఈ విషయాన్ని చైతూ, ఎన్టీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, చైతూలు కలసి ఓ సినిమాలో నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. 'గుండమ్మ కథ' రీమేక్ చెయ్యాలన్న ఆలోచన కూడా వచ్చింది. అయితే ఆ ప్రాజెక్ట్ ముందుకు కదలడం లేదు. కానీ ఆ కోరికను సావిత్రి ఇలా తీర్చిందన్న మాట..

English summary

Ntr and Naga Chaitanya in Savitri biopic movie