జూనియర్ - దర్శకేంద్రుని కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా?

Ntr and Raghavendra Rao movie

10:19 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Ntr and Raghavendra Rao movie

అప్పట్లో ఎన్టీఆర్- రాఘవేంద్రరావు కాంబినేషన్ లో మూవీ అంటే ఓ క్రేజ్ అడవి రాముడు మొదలుకుని మేజర్ చంద్రకాంత్ వరకూ వీరిద్దరి కాంబినేషన్ అదిరిపోయింది. ఇప్పుడు జూనియర్ తో దర్శకేంద్రుని మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వీరిద్దరీ కాంబినేషన్ లో మూవీ వస్తుందా అంటే, ముమ్మాటికీ అవుననే ఫిల్మ్నగర్ వర్గాలు అంటున్నాయి. 'ఓం నమో వేంకటేశాయ' తర్వాత ఎన్టీఆర్ తో దర్శకేంద్రుడు ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి ఇప్పటికే ఇటు హీరో, అటు డైరెక్టర్ మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. ఇందుకు మరికొంత సమయం పడుతుందట.

అటు జూనియర్ కూడా తన నెక్ట్స్ ఎవరితో అన్నదానిపై కొలిక్కిరాలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న పౌరాణికమా లేక సోషియో ఫాంటసీనా అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. టాలీవుడ్ లో ప్రిన్స్, బన్నీలతో రాఘవేంద్రరావు సినిమాలు చేశారు.. తారక్ చేయలేదు. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అని చెప్పక తప్పదు.

English summary

Ntr and Raghavendra Rao movie