ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి వస్తున్నారు

Ntr and Ram Charan movies on August 12th

06:34 PM ON 15th February, 2016 By Mirchi Vilas

Ntr and Ram Charan movies on August 12th

తెలుగు చిత్రసీమలో హీరోల మధ్య కాంపిటేషన్‌ పోటాపోటీగా ఉంది. ఈ సమ్మర్‌లో రామ్‌చరణ్‌-యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కి మధ్య పోటీ జరగనుంది. వీరు ఇరువురు వచ్చే వారంలో వారి కొత్త సినిమాలను ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రాలు ఆగష్టు 12న రిలీజ్‌ కానున్నాయని తెలియజేసారు. ఎన్టీఆర్‌ రాబోయే సినిమా జనతాగ్యారేజ్‌, ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. 'జనతాగ్యారేజ్‌' చిత్రం ఈ నెల 22 నుండి రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు నెల స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే అనగా 12న రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ ఐదున్నర నెలల్లో షూటింగ్‌ ని పూర్తి చేయాలని రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నారు.

రామ్‌చరణ్‌ విషయానికి వస్తే 'తనిఒరువన్‌' చిత్రం రీమేక్ తెలుగులో రామ్‌చరణ్‌ తేజ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఫిబ్రవరి 21న ప్రారంభమై ఆగష్టు 12న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ రీమేక్‌ చిత్రానికి దర్శకుడు సురేంద్ర రెడ్డి. రామ్‌చరణ్‌ సరసన బ్యూటీ క్వీన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించనుంది. రాబోయే సమ్మర్‌లో ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి మరి.

English summary

Young Tiger Ntr and Mega Power Star Ram Charan Tej movies were releasing on August 12th. Ntr Janatha Garage and Ram Charan Thani Oruvan remake were releasing on August 12th 2016.