నైట్ షిఫ్ట్స్ లో బాగా ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్-సమంత

Ntr and Samantha was working in night shifts for Janatha Garage

11:36 AM ON 18th June, 2016 By Mirchi Vilas

Ntr and Samantha was working in night shifts for Janatha Garage

అవునా అంటే అవుననే సమాధానం వస్తోంది.. ప్రస్తుతం ఎన్టీఆర్, సమంత కలిసి నైట్ షిఫ్టులు చేస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించి దర్శకుడు కొరటాల శివ నైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేశాడు. ఈ షెడ్యూల్స్ కోసమే తారక్-సమంత ఇలా రాత్రిళ్లు నిద్రలు మానుకొని పనిచేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఓ నైట్ షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో జరిగింది. రాత్రంతా కష్టపడి పనిచేసి అలిసిపోయి, పగలు ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయి నిద్రపోతున్నారు. మరో 3 రోజుల పాటు ఇలా ప్రత్యేక రాత్రిళ్లు గడపాలని హీరోహీరోయన్లు నిర్ణయించుకున్నారు. ఫిలింసిటీలో వేసిన చిన్న సెట్టింగ్ లో రాత్రి 11 గంటల వరకు షూటింగ్ చేశారు.

ఈసారి కూడా ఫిలింసిటీలోనే షూట్ ప్లాన్ చేసినప్పటికీ.. ఆ అర్థరాత్రి వేళ.. ఫిలింసిటీ నుంచి ఇంటికి చేరుకునేసరికి చాలా ఆలస్యమైపోతుందని యూనిట్ భావించింది. అందుకే ఈసారి నైట్ షెడ్యూల్ ను సిటీలోనే ప్లాన్ చేశారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్ లో ఎన్టీఆర్, సమంత మధ్య కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ లో జనతా గ్యారేజ్ అదరగొట్టింది. సినిమాకు దాదాపు 60 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు. ఈ ఉత్సాహంలో సినిమాను ఇంకా తొందరగా పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ మూవీ ఆడియోను వచ్చే నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఏ తేదీ అనేది ఇంకా ఫిక్స్ చేయలేదు. సినిమా ఆగష్టు 12న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మొత్తానికి రాత్రులలో నిద్ర మేల్కొని మరీ షూటింగులో పాల్గొంటున్న తారక్-సమంత నైట్ షిఫ్ట్ లతో బానే ఎంజాయ్ చేస్తున్నారు.

English summary

Ntr and Samantha was working in night shifts for Janatha Garage