మహేష్‌ రికార్డుని తిరగరాసిన ఎన్టీఆర్‌

Ntr beats Mahesh record

05:39 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Ntr beats Mahesh record

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 25వ చిత్రం 'నాన్నకుప్రేమతో'. క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పటి వరకు సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ప్రిన్స్ మహేష్‌బాబు-విక్టరీ వెంకటేష్‌ కలిసి నటించిన ఈ చిత్రం 51 కోట్లు షేర్‌ రాబట్టింది. ఇదే రికార్డు 3 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రికార్డుని ఎన్టీఆర్‌ బద్దలు కొట్టాడు. ఇప్పటికే 51 కోట్లు రికార్డుని దాటేసిన ఎన్టీఆర్‌ ఇంకా ఎన్ని కోట్లు రాబడతాడో వేచి చూడాలి. ఎన్టీఆర్‌ ఈ చిత్రంలోనే 50 కోట్ల క్లబ్‌లోకి కూడా చేరాడు.

English summary

Young Tiger Ntr beats Super Star Mahesh Babu record. 2013 Sankranthi release Seethamma Vaakitlo Sirimalle Chettu collected 51 crores and set a record. Now Ntr Nannaku Prematho movie breaks Mahesh record.