పవన్ రికార్డును బద్దలుకొట్టిన ఎన్టీఆర్!!

Ntr breaks Pawan Kalyan record

05:36 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Ntr breaks Pawan Kalyan record

జూనియర్‌ ఎన్టీఆర్ హీరోగా నటించి సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా 'నాన్నకుప్రేమతో'. సినిమా విడుదలై రెండవ వారంలో ఉన్నప్పటికీ యూఎస్ లో ఏ మాత్రమూ జోరు తగ్గకుండా విజయవంతంగా కొనసాగుతుంది. యూఎస్ లో కొన్ని ప్రాంతాలలో మంచు తుఫాను మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు వల్ల కలెక్షన్లు కొంచెం తగ్గాయి. అయినప్పటికీ 1,918,392 డాలర్ల (11 కోట్ల 51 లక్షల 3 వేల 5 వందల 20 రూపాయిలు) మొత్తం వసూళ్ళతో పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌ నటించిన 'అత్తారింటికి దారేది' కలెక్షన్లు దేటేసింది.

'అత్తారింటికి దారేది' సినిమాకి ఇప్పటి వరకూ మొత్తం 18,90,000 డాలర్లు (11 కోట్ల 34 లక్షలు) వసూలు చేసింది. దీంతో 'నాన్నకుప్రేమతో' సినిమా యూఎస్ లో అతిపెద్ద తెలుగు చిత్రాలలో బాహుబలి, శ్రీమంతుడు తరవాత మూడవ స్థానం సంపాదించింది. అయితే తెలుగులో ఈ సినిమాకి సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్‌ప్రెస్‌ రాజా సినిమాలు గట్టి పోటీ ఇవ్వడం వల్ల తెలుగులో కలెక్షన్లు అంత గొప్పగా లేవు.

English summary

Nannaku Prematho breaks Pawan Kalyan Attarintiki Daredi collections record. Nannaku Prematho earned at box office was 11,51,03,520 crores collections in 2nd week. Attarinitki Daredi cillections was 11 crores 34 lakhs in 2nd week. Nannaku Prematho was directed by Sukumar.