ఎన్టీఆర్ బావమరిది సినీరంగ ప్రవేశం చేస్తున్నాడా??

Ntr brother in law is giving entry in film industry

06:57 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Ntr brother in law is giving entry in film industry

యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రణతి వివాహ దాంపత్యం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరికీ ఒక కుమారుడు ఉన్న విషయం కూడా తెలిసిందే. ఎన్టీఆర్ తన కుమారునితో తరచూ ఫోటోలు దిగి అభిమానులు కోసం సోషియల్ మీడియా లో పెడుతూ ఉంటారు. ఎన్టీఆర్ సతీమణి కూడా అప్పుడప్పుడు తన కుమారుని తో ఫోటోలు దిగి తను కూడా ఫోటోలు పెడుతూ ఉంటుంది. అయితే అందరికీ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే తెలుసు కానీ ప్రణతి కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదు. అందుకేనేమో ప్రణతి తన సోదరుడుతో ఫోటో దిగి సోషియల్ మీడియా లో పెట్టింది. ఈ ఫోటో కి అనూహ్య స్పందనతో పాటు అనుకోని విధంగా కామెంట్లు కూడా వస్తున్నాయి.

'అరె ఎన్టీఆర్ బావ మరిది కూడా బాగున్నాడే' అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రణతి సోదరుడు నితిన్ కి కూడా నటనంటే మక్కువ ఉండటంతో నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఎలాగో అందగాడు కాబట్టి హీరో గా ఎంట్రీ ఇవ్వడంలో సందేహం లేదనిపిస్తుంది. ఎలాగో నితిన్ బావ ఎన్టీఆర్ స్టార్ హీరో కాబట్టి తనకి సినీరంగ ప్రవేశం చాలా సులభమే అని చెప్పొచ్చు. అయితే టాలెంట్ ఉంటే కానీ మన తెలుగు ప్రేక్షకులు ఎవరిని అంత త్వరగా ఆదరించరు. మరి నితిన్ లో ఆ టాలెంట్ ఉందో లేదో చూడాలి.

English summary

Ntr brother in law Nithin is interested in acting. So he is taking training in acting department. Nithin is the brother of Ntr's wife Pranathi.