డైరెక్టర్‌ ను మోసం చేసిన ఎన్టీఆర్‌

Ntr cheated director

01:40 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Ntr cheated director

రచయితలు నుండి దర్శకులుగా మారాలని ప్రతీ రచయిత కలలు కంటాడు. తాను రాసిన కథను తానే స్వయంగా తెరకెక్కించాలని ఆశ పడతారు. అలా రచయిత నుండి దర్శకులుగా మారిన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, కొరటాల శివ సక్సెస్‌ని చవి చూశారు, చూస్తున్నారు కూడా. తాజాగా ఈ కోవలోకి ఎంటరవ్వాలని స్టార్‌ రైటర్‌ వక్కంతం వంశీ కలలు కన్నాడు. కిక్‌, ఎవడు, రేసుగుర్రం, టెంపర్‌, అశోక్‌, కత్తి, అతిధి వంటి చిత్రాలకు పని చేసిన వక్కంతం వంశీ దర్శకత్వ శాఖలో అడుగు పెట్టాలనుకున్నాడు. అందుకోసం తన క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన ఎన్టీఆర్‌ తో ఒక చిత్రం తెరకెక్కించాలనుకున్నాడు. దాని కోసమే 'టెంపర్‌' కథని సిద్దం చేసుకున్నాడు.

కానీ ఎన్టీఆర్‌ మాత్రం వంశీని తరువాత చిత్రానికి దర్శకత్వం చేద్దూగానీ అని ఒప్పించి ఆ కథను పూరీ జగన్నాధ్‌ చేతిలో పెట్టాడు. ఆ తరువాత అయినా ఎన్టీఆర్‌ తో సినిమా చేద్దామనుకున్న వంశీ ఎన్టీఆర్‌ అవకాశం ఇవ్వకుండా నమ్మించి మోసం చేశాడు. టెంపర్‌ తరువాత ఎన్టీఆర్‌ నాన్నకుప్రేమతో చిత్రంలో నటించాడు. ఆ తరువాత అయినా వంశీకి ఛాన్స్‌ వస్తుందనుకుంటే కొరటాల శివ కి అవకాశమిచ్చాడు ఎన్టీఆర్‌. ఇంక ఎన్టీఆర్‌ తో సినిమా తీయలేనని భావించిన వంశీ చేసేది లేక వేరే హీరోని ఆశ్రయించాడు. తను రాసుకున్న కథను విక్టరీ వెంకటేష్‌ కి వినిపించి ఓకే చేయించుకున్నాడు. అయితే వంశీ తన మొదటి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో తెరకెక్కించాలన్న కల మాత్రం నెరవేరలేదని బాధపడుతున్నాడు.

English summary

Young Tiger Ntr cheated director Vakkantham Vamsi. Ntr told that i will give chance for my movie as a director but he didn't give chance.