కొరటాలకి క్లాస్‌ పీకిన ఎన్టీఆర్‌

Ntr class to Koratala Siva

01:00 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Ntr class to Koratala Siva

'నాన్నకుప్రేమతో' విజయం తరువాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం 'జనతాగ్యారేజ్‌'. మిర్చి, శ్రీమంతుడు వంటి విజయవంత చిత్రాలు తెరకెక్కించిన కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఇందులో ఎన్టీఆర్‌ కి పెద్దనాన్నలా నటిస్తున్నారు. అలనాటి అందాల నటి దేవయాని ఇందులో మోహన్‌లాల్‌ కి భార్యగా నటిస్తుంది. అయితే ఇదిలా ఉంటే మొదటి రెండు చిత్రాలు హీరోల పైన ఆధారపడ్డ కొరటాల ఈసారి తన చిత్రంలో ఇతర నటులకి కూడా ప్రాధాన్యమిచ్చే చిత్రంగా 'జనతా' ని తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఎన్టీఆర్‌ టెంపర్‌, నాన్నకు ప్రేమతో వంటి హిట్‌ చిత్రాలతో మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. దీనినే కంటిన్యూ చెయ్యాలని ఎన్టీఆర్‌ ప్లాన్‌ అట. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ ప్రాంభంమైన విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్‌ కొరటాల శివ కి క్లాస్‌ కూడా పీకాడట. ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రం హిట్‌ కావాలని చెప్పాడట. అంతేకాదు కధలో జరిగిన మార్పులని కూడా అడిగి తెలుసుకున్నాడట. ఇదిలా ఉంటే షూటింగ్‌ మొత్తం పూర్తయ్యాక మళ్లీ ఏమైనా రీషూట్‌ కావాలంటే కొన్ని సన్నివేశాల్ని రీషూట్‌ కూడా చేద్దామని చెప్పాడట. మొత్తం మీద ఎన్టీఆర్‌ కచ్చితంగా హ్యాట్రిక్‌ విజయం సాధించాలని కొరటాలకి గట్టిగానే క్లాస్‌ పీకినట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

English summary

Ntr gave class to Koratala Siva. Young Tiger Ntr is now acting in Koratala Siva direction in Janatha Garage movie. In this movie Samantha and Nithya Menon is acting as a heroines with Ntr.