బాహుబలికి అవార్డు రావడం పై స్పందించిన ఎన్టీఆర్

NTR congratulated Rajamouli

05:46 PM ON 28th March, 2016 By Mirchi Vilas

NTR congratulated Rajamouli

నాన్నకు ప్రేమతో చిత్రం విజయం సాధించడంతో యమ ఖుషీ గా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "జనత గ్యారేజ్ " సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఎప్పుడు సోషల్ మీడియా లో అంతగా యాక్టివ్ గా ఉండని ఎన్టీఆర్ తాజాగా మళ్ళి యాక్టివ్ అయ్యాడు. తనకు అత్యంత ఆప్త మిత్రుడైన ఎస్.ఎస్.రాజమౌళి ని అభినందించడానికి మళ్ళి ట్విట్టర్ లోకి వచ్చాడు.

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో , రాజమౌళి ను ప్రశంసిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసాడు. 63 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా అయిన బాహుబలి చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని , రాజమౌళి , బాహుబలి చిత్ర యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపాడు . ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆనందించాల్సిన విషయమని ట్వీట్ చేసాడు.

ఇవి కూడా చదవండి:

కమ్మ కులం గొప్పేంటి ?: జగపతిబాబు

నెట్‌లో హల్‌చల్ చేస్తున్న షారూఖ్ కూతురు బికినీ ఫోటో లు

సంగీత్ లో చిరు పాటలకు శ్రీజ-కల్యాణ్ జంట స్టెప్స్(వీడియో)

English summary

Junior NTR congratulated Director S.S.Rajamouli for winning National Award For Best Film for Bahubali Movie.NTR congratulated Rajamouli on Twitter