ఎన్టీఆర్‌ కొరటాలకి అంత కాస్ట్లీ గిఫ్ట్‌ ఎందుకిచ్చినట్టు ?

NTR Costly Gift To Koratala Siva

11:45 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

NTR Costly Gift To Koratala Siva

'నాన్నకుప్రేమతో' చిత్రం ఇచ్చిన ఘన విజయంతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫుల్‌ జోష్‌ మీద ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించాడని ఎంతో మంది విమర్శకులు కుడా ప్రశంసలు కురిపించారు. ఈ జోష్‌తోనే ఎన్టీఆర్‌ మరో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. మిర్చి, శ్రీమంతుడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో మంచి ఫామ్‌లో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' చిత్రంలో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ నిన్నే రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. ఈ షూటింగ్‌ లో పాల్గొన్న ఎన్టీఆర్‌ కొరటాల శివ చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు చూసి ఎంతో ఆశ్చర్యపోయాడట. కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందన్న ధీమాతో ఎన్టీఆర్‌ ఉన్నట్లు సమాచారం. తన కోసం అంత మంచి కథ రాశాడని ఎన్టీఆర్‌ కొరటాల శివకి ఒక వాచీ గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఆ వాచీ ఖరీదు వింటే మీరు షాకౌతారు. దాని ఖరీదు 20 లక్షలు నుండి 25 లక్షల వరకు ఉంటుందట.

English summary

NTR was enjoying the success of Nannaku Premato and now he was acting under the direction of Koratala Siva in Janat Garage.This film shooting was started yesterday in Ramoji film city.On this ocassion NTR impressed with Koratala Siva's direction and he gifted a costly watch worth 25 lakhs to Koratala Siva.