కమల్ తరువాత ఆ రికార్డు ఎన్టీఆర్ దే

NTR Creates New Record With His Different Looks

02:55 PM ON 20th February, 2016 By Mirchi Vilas

NTR Creates New Record With His Different Looks

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు 25 సినిమాల్లో నటించాడు. తాజాగా వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో ఎన్టీఆర్‌ ఆ ఫీట్‌ని చేరుకున్నాడు. ఇప్పుడున్న హీరోల్లో ఈ ఫీట్‌ని ముందుగా చేరుకున్నది ఎన్టీఆర్‌ మాత్రమే. 'నాన్నకుప్రేమతో' చిత్రంతో 50 కోట్లు క్లబ్‌లోకి కూడా చేరిపోయాడు. అయితే ఎన్టీఆర్‌ మరో రికార్డుని కూడా క్రియేట్‌ చేశాడు. అదేంటంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నటించిన 25 సినిమాల్లో దాదాపు 22 సినిమాల్లో ఎన్టీఆర్‌ తన లుక్‌ని మార్చుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్‌ లో మరే హీరో ఈ విన్యాసాన్ని చేయలేదు. సౌత్‌లో కమల్‌ హాసన్‌ అన్ని లుక్స్‌ని మార్చగా, టాలీవుడ్‌ లో ఎన్టీఆర్‌ మాత్రమే అది చేయగలిగాడు. మళ్ళీ ఇప్పట్లో ఎన్టీఆర్‌ రికార్డుని ఎవరూ బ్రేక్‌ చెయ్యలేరని తెలుస్తుంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరో కొత్త లుక్‌తో రాబోతున్నాడని సమాచారం. 

1/26 Pages

నిన్నుచూడాలని

English summary

Young Tiger NTR has created a new record for his different Get Up's in his movies.Upto now NTR has acted in 25 movies and NTR had acted in 22 different roles.After his kamala hassan NTR was only the hero in South India to acted in 22 different looks