ఫ్రీ గా సినిమా చేస్తున్న ఎన్టీఆర్

NTR Doing Janata Garage Movie For Free

01:08 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

NTR Doing Janata Garage Movie For Free

మాములుగా మన హీరోలు ఒక సూపర్ హిట్ సినిమా తరువాత ఏ హీరో అయినా ఇంకెవరైనా తమ తరువాత సినిమాకు తమ రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచేస్తారు . అలాంటిది రెండు హిట్లు పడితే ఇక వారి రెమ్యునరేషన్ చుక్కల్లోనే ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో వరుసగా టెంపర్,నాన్నకుప్రేమతో లాంటి రెండు వరుస సూపర్ హిట్ సినిమాల తరువాత ఇప్పుడు నటిస్తున్న "జనతాగ్యారేజ్" సినిమాకు ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట.

ఇవి కూడా చదవండి:జగన్ దెబ్బకు పవన్ మూవీకి బ్రేకు?
ప్రభాస్ మిర్చి , మహేష్ బాబుతో శ్రీమంతుడు లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ సినిమాలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది .ఈ సినిమాను ఎలాగైనా ఆగస్టు 12 న రిలీజ్ చేయాలని ఈ చిత్ర యూనిట్ భావిస్తోందట.

జనతా గ్యారేజ్ సినిమా కోసం ఎన్టీఆర్ తో పాటు, ఆ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇద్దరు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఈ సినిమాకి పని చేస్తున్నారట.రెమ్యునరేషన్ బదులు సినిమాకు వచ్చే కలెక్షన్స్ లో వాటా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.దాంతో సినిమా మొత్తం 30 కోట్లలోపు బడ్జెట్ లోనే పూర్తి కాబోతుందని తెలుస్తోంది .

ఇవి కూడా చదవండి:కిడ్నాప్‌ అయిన బాలుడు దారుణ హత్య

ఇవి కూడా చదవండి:అడ్డంగా దొరికేసిన షిమ్లా గురూజీ రాసలీలలు(వీడియో)

English summary

Young Tiger Junior NTR was presently acting in Janata Garage Movie under the direction of Koratala Shiva Movie and recent news came to know that From Film Industry that NTR and Director Koratala Shiva taking Share of the movie instead of Remuneration.