మోహన్ బాబుకి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ ఫాన్స్

Ntr fans gave warning to Mohan Babu

11:13 AM ON 29th April, 2016 By Mirchi Vilas

Ntr fans gave warning to Mohan Babu

మెహన్ బాబుకు మన టాలీవుడ్ చాలా మంచి పేరు ఉంది. మెహన్ బాబు అటు విలన్ గా ఇటు హీరోగా నటించి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు. ఆయన్ని మన టాలీవుడ్ లో అప్పుట్లో కలెక్షన్ కింగ్ అని ముద్దుగా పిలుచుకునేవారు. ఆ తరువాత తారక్ తో కలిసి 'యమదొంగ' లో అదిరిపోయే యాక్టింగ్ తో తారక్ తో సమానం గా నటించి ఔరా అనిపించాడు. కానీ ఇప్పుడు తారక్ తో కలిసి వివాదం చెలరేగే విధంగా కామెంట్స్ చేశాడు. అయితే ఇవి వ్యక్తిగతం గా చేయకపోయినా సరే, ఈ కామెంట్స్ ను మాత్రం ఒకసారి ఆలోచించాల్సినవే. ఎందుకంటే మొన్న ఫిబ్రవరి నెలలో ఎన్టీఆర్ నాకు నాగచైతన్య తో కలిసి 'గుండమ్మ కథ' సినిమాను రీమేక్ చెయ్యాలని ఉందని పబ్లికగానే చెప్పాడు.

ఇది కూడా చదవండి: మగాడ్ని రేప్ చేసి దాన్ని ఎత్తుకెళ్ళారు(వీడియో)

ఈ విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మరో ప్రక్క మన కింగ్ నాగార్జున ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు అయితే బాగుంటుంది అని ఆయన్ని ఒప్పించాడు కూడా. అయితే మరి ఈ విషయాలు మెహన్ బాబుకు తెలీదో ఏమో గానీ, మెన్న 'ఈడోరకం ఆడోరకం' సినిమా సక్సెస్ మీట్ లో ఎంత ఖర్చు అయినా సరే నేను ఈ సినిమాను విష్ణు మరియు రాజ్ తరణ్ లతో కలిసి చేస్తాను అని ప్రకటించాడు. దాంతో ఈ ప్రకటన కొందరికి ఆసక్తిని కలిగిస్తే మరి కొందరికి మాత్రం బాధను కలిగిచింది. ఎన్టీఆర్ ఈ సినిమా గురించి మనసులో మాట చెప్పగానే ఎన్టీఆర్ అభిమానుల్లో ఎదో ఒక తెలియని సంతోషం కలిగింది.

ఇది కూడా చదవండి: స్టేజి పై అల్లు అర్జున్ పరువు తీసిన ఫైట్ మాస్టర్స్

కానీ మెహన్ బాబు ఇలా అర్థాంతరంగా ప్రకటన ఇచ్చేసరికి మాత్రం కొంత బాధని కలిగించి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ కూడా మెహన్ బాబు నీకిది తగునా.. ఎన్టీఆర్ ఇష్ట పడ్డ సినిమా జోలికి రావడం అంత అవసరమా అని అంటున్నారు. మరికొందరైతే తిడుతూ మెసెజ్ లు పెడుతున్నారు. మరి కొందరైతే మాస్ కా బాప్ ఎన్టీఆర్ జోలికి రాకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా సరే మెహన్ బాబు వేదికల పై కాస్త ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని అందరి అభిప్రాయం. అప్పట్లో చిరంజీవి విషయంలో కూడా ఇలాగే వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి తెలిసిందే.

English summary

Ntr fans gave warning to Mohan Babu. Recently Mohan Babu told that i want to remake Gundamma Katha with Vishnu and Raj Tarun. But in earlier Ntr like to remake Gundamma Katha with Naga Chaitanya.