మా టీవీని బండ బూతులు తిడుతున్న ఎన్టీఆర్ ఫాన్స్.. ఎందుకో తెలుసా?

Ntr fans serious on Maa tv

11:54 AM ON 19th October, 2016 By Mirchi Vilas

Ntr fans serious on Maa tv

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ ఛానల్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురైంది. సోషల్ నెట్ వర్క్ లో సదరు ఛానెల్ పై ఎన్టీఆర్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ దీనికి కారణం ఏమిటా అని పరిశీలిస్తే, దీపావళి రోజున ఆ ఛానల్ జనతా గ్యారేజ్ సినిమా టెలికాస్ట్ చేయాలని నిర్ణయించడమేనట. తమ అభిమాన హీరో సినిమా పండుగ రోజున టెలీకాస్ట్ చేస్తే అందుకు సంతోషించాలి కానీ ఆగ్రహించడం ఎందుకు అనుకుంటున్నారా? అక్కడే వుంది కిటుకు. తమ అభిమాన హీరో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి, రూ. 100కోట్ల క్లబ్ లో చేరిన సినిమాను ఎలాగైనా కొన్ని థియేటర్లలో వందరోజులు ఆడించాలనేది అభిమానుల ప్లాన్. త్వరలో ఈ చిత్రం 50 రోజుల మార్క్ ను దాటనుంది.

ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన సెంటర్లలో 50 రోజుల పండుగను చేసి, దీన్నొక రికార్డుగా నెలకొల్పాలనేది కూడా ఆ ప్లాన్ లో భాగం. అయితే, ఈ ఆశలపై నీళ్లు చల్లుతూ దీపావళి రోజున ఆ ఛానల్ జనతా గ్యారెజ్ ను టెలీకాస్ట్ చేస్తుండడంతో.. ఇక థియేటర్ కు వచ్చి తమ హీరో సినిమా ఎవరు చూస్తారని అభిమానులు ఆందోళన చెందుతున్నారట. దీంతో ఆ ఛానెల్ కు వ్యతిరేకంగా సోషల్ నెట్ వర్క్ లో తమ దాడిని మొదలు పెట్టారట. అయితే, ఎన్నోకోట్లు పెట్టి హక్కులు కొనుక్కున్న ఆ ఛానెల్ దీపావళి సందర్భంగా తమకు కలిసొచ్చే ప్రకటనల వ్యాపారాన్ని ఎలా వద్దనుకుంటుంది. దీపావళికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనకు ఆ ఛానల్ సద్దుమణగుతుందా లేదా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

English summary

Ntr fans serious on Maa tv