గ్యారేజీ రిలీజ్ డేట్ మారుతుందా?

Ntr Film Janatha Garage Release Date

11:22 AM ON 13th August, 2016 By Mirchi Vilas

Ntr Film Janatha Garage Release Date

టెంపర్, నాన్నకు ప్రేమతో ఊపును కొనసాగించచడమే కాకుండా శ్రీమంతుడు రికార్డులు బ్రేక్ చేయడం, రూ. 50 కోట్ల క్లబ్ లో చేరడంపై, కన్నేసిన నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హ్యాట్రిక్ కోసం పట్టుదలగా శ్రమిస్తున్నాడు. అందుకే జనతా గ్యారేజ్ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఊహించినట్టుగానే ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ అభిమానులను ఒక ఊపు ఊపడమే కాకుండా ఇండస్ట్రీ యావత్తూ ఈ చిత్రం కోసం ఎదురు చూసేలా చేసింది.

బౌండెడ్ స్క్రిప్ట్ తో షూటింగ్ మొదలు పెట్టిన ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ అనుకున్న టైంలో షూటింగ్ పూర్తిచేసి ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేశాడు. దానికి తగ్గట్లుగానే శరవేగంగా షూటింగ్ చేసినప్పటికీ, హడావిడిగా విడుదల చేస్తే పొరపాట్లు జరుగుతాయని సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు. అయితే, ఇది కూడా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. 2వ తేదీన సినిమాను విడుదల చేయాలా వద్దా? అని చిత్ర బృందం ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఎందుకంటే, సెప్టెంబర్ 2వ తేదీన వామపక్ష పార్టీలు దేశవ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చాయి. ఓపెనింగ్ రికార్డ్స్ సాధించాలని పట్టుదలగా ఉన్న ఈ చిత్ర బృందం 2న విడుదల చేస్తే. ఆ ప్రభావం సినిమాపై ఉండొచ్చని యూనిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

కేవలం తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని మలయళ భాషలో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే కేరళలో బంద్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా ఓపెనింగ్ వసూళ్లపై కచ్చితంగా ప్రభావం పడుతుందని భావిస్తున్న దర్శకనిర్మాతలు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2కు ఒకరోజు ముందు గానీ తరువాత విడుదల చేయాలని తర్జన భర్జన పడుతున్నట్టు టాలీవుడ్ టాక్. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న జనతా గ్యారేజ్ చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇది కూడా చూడండి: గౌతమీ పుత్రకు మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడోచ్

ఇది కూడా చూడండి: సెట్ లో నే పెళ్లి అయిపొయింది

ఇది కూడా చూడండి: పాడు అలవాటుని భార్యే మాన్పించింది

English summary

Ntr Film Janatha Garage Release Date may be postponed.