పవన్ బర్త్ డేకి జూనియర్ గిఫ్ట్

Ntr gift for Pawan Kalyan birthday

11:42 AM ON 20th July, 2016 By Mirchi Vilas

Ntr gift for Pawan Kalyan birthday

టీజర్ తో అంచనాలు రెట్టింపు చేసిన జనతా గ్యారేజ్ మూవీ. రిలీజ్ సెప్టెంబర్ వెళ్లడంతో అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. అయితే యాదృచ్ఛికమో మరేటో తెలీదు గానీ సినిమా వాయిదాలో కూడా లాజిక్కు ఉందట. సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి వున్న క్రేజ్ చాలా ఎక్కువే కదా. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. ఆరోజు పవన్ అభిమానులకు పండగే పండగ. బోలెడన్నీ సేవాకార్యక్రమాలు ఉంటాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా వాయిదా పడడం సరాసరి వెళ్లి పవన్ బర్త్ డే రోజునే రిలీజ్ చెయ్యాలని నిర్ణయించడం విశేషం.

ఆరోజు పవన్ జన్మదినమని తెలిసే, ఆరోజు విడుదల చేయాలని నిర్ణయించారా, యాదృచ్చికంగా మంచి రోజని ఆరోజు విడుదల చేయాలనై అనుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికి పవర్ స్టార్ కి యంగ్ టైగర్ బర్త్ డే గిఫ్ట్ గా జనతా గ్యారేజ్ రిలీజ్ చేస్తున్నాడని చెప్పాలి.

సాంగ్ లీక్...

కాగా ప్రస్తుతం జనతా గ్యారేజ్ ఫిల్మ్ కి సంబంధించి ఓ సాంగ్ బయటకు వచ్చింది. దాదాపు నాలుగు నిమిషాల నిడివిగల దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ అనే పల్లవితో సాగే ఈ పెప్పీ ట్యూన్ ను దేవిశ్రీప్రసాద్ పాడాడు... హీరోయిన్ ని ఉద్ధేశించినట్టే ఇది కనిపిస్తోంది. ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. సాంగ్ క్లియర్ గా వుండడంతో యూనిట్ దీన్ని రిలీజ్ చేసి వుండవచ్చుననే కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Ntr gift for Pawan Kalyan birthday