'బాహుబలి 2' లో జయదేవ్ రాణాగా ఎన్టీఆర్!

Ntr in Baahubali 2

01:17 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Ntr in Baahubali 2

ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'బాహుబలి 2' ని బాహుబలిని తలదన్నేలా తీర్చిదిద్దుతున్నాడు జక్కన్న. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక హాట్ న్యూస్ ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే రాజమౌళికి ఆప్త మిత్రుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక గెస్ట్ రోల్ లో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు ఇలాంటి వార్తలే వచ్చినా రాజమౌళి దానిని ఖండించాడు. కానీ ఎన్టీఆర్ నటిస్తున్నాడని కచ్చితంగా స్పష్టం చేసారు.

'బాహుబలి 2' లో ఒక కొత్త పాత్రని రాజమౌళి సృష్టించాడట, అదే చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందట. అదే జయదేవ్ రాణా పాత్ర. ఇందులో ఎన్టీఆర్ అయితే బాగుంటాడని తెలుగు వెర్షన్ కి తీసుకున్నాడట జక్కన్న. తమిళ్ వెర్షన్ లో అయితే స్టార్ హీరో సూర్య ని తీసుకోబోతున్నాడట. అది అసలు సంగతి. బాహుబలి 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నాడని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులకు ఒక పండుగ లా అనిపిస్తుంది.

English summary

Ntr in Baahubali 2. Young Tiger Ntr is acing as a Jayadev Rana in Baahubali 2. Now this news is going viral in internet.