పవర్‌స్టార్‌ ఆడియో రిలీజ్‌కి చీఫ్‌గెస్ట్‌ గా ఎన్‌టీఆర్!!

Ntr is chief guest for Power star audio launch

01:33 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Ntr is chief guest for Power star audio launch

పవర్‌స్టార్‌ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్ కి నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ రావడమేంటి. ఇద్దరు ఒకే ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ మాట్లాడుకున్నట్టుగా అయినా కనిపించలేదు. అయినా పవర్‌స్టార్‌ పవన్‌ ఉండగా మరో చీఫ్గెస్ట్ ఎందుకు? కానీ ఇదంతా టాలీవుడ్‌ కి సంబంధించింది కాదు. శాండిళ్వుడ్‌ కి సంబంధించింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'చక్రవ్యూహ'. ఎస్‌.ఎస్‌. థమన్ ఈ సినిమాకి సంగీత అందించారు. ఈ చిత్రంలో ఎన్‌టీఆర్ ఒక సాంగ్‌ పాడాడు. ఎన్‌టీఆర్ తో మాత్రమే కాదు, కాజల్‌ తో కూడా ఈ చిత్రంలో ఒక సాంగ్‌ పాడించాడు థమన్.

ఈ సినిమా ప్రొడ్యూసర్‌ లోహిత్‌ ఎన్‌టీఆర్ కి మంచి స్నేహితుడు. థమన్ కూడా ఎన్‌టీఆర్ కి సన్నిహితుడు. ఇవన్నీ కలిసిరావడంతో ఈ సినిమా ఆడియో ఫంక్షన్‌ కి ఎన్‌టీఆర్ ని చీఫ్‌గెస్ట్‌ గా పిలవాలని ప్రొడ్యూసర్‌ లోహిత్‌ అనుకుంటున్నాడు. హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ ని కన్నడలో పవర్‌స్టార్‌ అని పిలుస్తారు. కాబట్టి పవర్‌స్టార్‌ ఆడియో ఫంక్షన్‌ కి ఎన్‌టీఆర్ హాజరవ్వనున్నాడు. ఈ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ ఫిబ్రవరి రెండవ వారంలో జరగనుంది.

English summary

Ntr is chief guest for Kannada Power star Puneet Rajkumar Chakravyuh audio launch. Ntr sungs a song for this film. S.S. Thaman composed music for this movie.