హీరోయిన్ని కామెంట్ చేసిన  ఎన్టీఆర్ తల్లి

NTR Mother Comments On Rakul

09:35 AM ON 19th January, 2016 By Mirchi Vilas

NTR Mother Comments On Rakul

ఇన్నాళ్ళు తెరవెనుక ఉంటూ వస్తున్న ఎన్టిఆర్ తల్లి శాలిని తొలిసారి కామెంట్ చేయడం చర్చకు దారితీసింది. అదికూడా ఓ హీరోయిన్ గురించి.... పైగా 'నాన్నకు ప్రేమతో' హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కామెంట్ చేసారట. ఇంతకీ విషయంలోకి వెళితే,

ఎప్పుడూ హీరోయిన్ల గురించి మాట్లాడని ఎన్టీఆర్ తల్లి ఈసారి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొడుకు దగ్గర ప్రస్తావించిందట. తన కొడుకు ఇప్పటిదాకా పాతిక సినిమాలు చేసినప్పటికీ అందులో తొలిసారి ఓ హీరోయిన్ గురించి ప్రస్తావించడం ఇదే తొలిసారట. అయితే పాజిటివ్ గానే స్పందించారట. ఇంతవరకు ఎవరినీ పొగడని ఎన్టిఆర్ తల్లి తొలిసారి రకుల్ ప్రీత్ సింగ్ పై ప్రశంసలు కురిపించడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా రకుల్ ప్రీత్ సింగ్ అదృష్టవంతురాలేనని చెప్పక తప్పదు.

రకుల్ ప్రీత్ సింగ్ ని తన తల్లి మెచ్చుకున్నసంగతి ఎన్టీఆరే స్వయంగా వెల్లడించాడు. ‘‘నాన్నకు ప్రేమతో సినిమాలో నన్ను చూసి మా అమ్మ ఎంతో సంతోషించింది. నా సినిమాల్లోని హీరోయిన్లను ఎప్పుడూ మెచ్చుకోని అమ్మ తొలిసారి రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడేసరికి కారణం ఏమై ఉంటుందా అనుకున్నా. బహుశా రకుల్ తనే డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల ఆమె తెలుగమ్మాయి అనుకుని కనెక్టయిపోయిందేమో’’ అని ఎన్టీఆర్ అంటున్నాడు.

తన జీవితాంతం ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను గుర్తుంచుకుంటానని ఎన్టీఆర్ చెబుతున్నాడు. ‘‘ఈ విజయం తాలూకు అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇది సుకుమార్ ఘనత. నేను బతికున్నంత కాలం ‘నాన్నకు ప్రేమతో’ నాలోనే నిలిచి ఉంటుంది. నేను ఏ గెటప్ వేసినా అది తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకాన్ని నాలో కలిగించిన అభిమానులు ప్రేక్షకులకు ధన్యవాదాలు. దేవిశ్రీ ఈ సినిమా కోసం చూపించిన కమిట్మెంట్ ను ఎప్పటికీ మరువలేను. సినిమా అయిపోయాక కూడా నాన్నకు ప్రేమతో.. అనే పాట కోసం జనాలు అలాగే థియేటర్లో నిలబడి ఉంటున్నారు. దేవిశ్రీ తన సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. దేవిశ్రీ తండ్రి సత్యమూర్తిగారే తనతో ఈ పాట రాయించినట్లున్నారు’’ అని ఎన్టీఆర్ ఆనందంగా చెప్పడం చూస్తుంటే, వాళ్ళ ఇంట్లో ఈ సినిమా గురించి బాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఉంటుదనడంలో సందేహంలేదు.

English summary

On the success meet of Nannaku Prematho Movie Hero Junior NTR says that his mother for the first time praised Rakul Preeth Singh who was acted as heroine in Nannaku prematho movie