నాన్నకు ప్రేమతో రిలీజవ్వక ముందే 31 కోట్లు వసూలు చేసింది!!

Ntr Nannaku Prematho Collected 31 crores in 3 areas

07:42 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Ntr Nannaku Prematho Collected 31 crores in 3 areas

బాలకృష్ణ తరువాత నందమూరి నట వారసుడిగా జూనియర్‌ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు వచ్చారు. తాతగారిలా డైలాగులు చెప్పడం ఈ ఎన్టీఆర్‌కే చెల్లింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దసరాకు ముందు విడుదల చేసిన నాన్నకు ప్రేమతో ఫస్ట్‌లుక్స్‌తో ఎన్టీఆర్‌ ఒక హాలీవుడ్‌ హీరో స్టైల్‌లో ఉన్నాడని కితాబులు ఇచ్చారు. ఆ తరువాత దసరాకి రిలీజ్‌ చేసిన టీజర్‌తో యూట్యూబ్‌లో ఎన్టీఆర్‌కి అత్యధిక వ్యూలు వచ్చిన చిత్రంగా ఇది రికార్డులకి ఎక్కింది.

తాజాగా ఈ చిత్రం పై మరో రికార్డు చోటు చేసుకుంది. ఒక్క మూడు ఏరియాల్లోనే 31 కోట్లు రిలీజ్‌కు ముందు వసూలు చేసింది. వివరాల్లోకెలితే నాన్నకు ప్రేమతో నైజాం రైట్స్‌ను అభిషేక్‌ పిక్చర్స్‌ అధినేత రూ. 16 కోట్లకు సొంతం చేసుకోగా, ఓవర్సీస్‌లో ఏకంగా 7.10 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్‌కి బాగా డిమాండ్‌ ఉన్న సీడెడ్‌లో ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా రూ. 8.45 కోట్లకు అమ్ముడయింది. దీంతో ఈ మూడు ఏరియాల్లోనే మొత్తం రూ.31 కోట్లు వసూలు చేసింది. ఇంకా మిగిలిన కోస్తా, కర్ణాటక, చెన్నైలో బిజినెస్‌ కలుపుకుంటే 60 కోట్లు మార్కును అందుకుంటుందని సినీపండితుల అంచనా.

English summary

Ntr Nannaku Prematho Collected 31 crores in 3 areas. In Nijam, Overseas, Seeded areas collected 31 crores.