పక్కా మాస్ లుక్ తో అదరగొడుతున్న ఎన్టీఆర్!

Ntr new poster from Janatha Garage

01:18 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Ntr new poster from Janatha Garage

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సినిమా పై హైప్ పెంచేశాయి. అప్పటిదాకా ఒక మూస లుక్ తో ఉండే ఎన్టీఆర్ టెంపర్ చిత్రంతో కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. ఆ సినిమా మీద హైప్ రావడానికి తొలి కారణం ఎన్టీఆర్ లుక్కే. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో సినిమాకు మరింత రిఫ్రెషింగ్ లుక్ లోకి మారిపోయి.. అభిమానులకు సరికొత్త అనుభూతినిచ్చాడు తారక్.

ఇప్పుడిక జనతా గ్యారేజ్ విషయంలోనూ ఎప్పటికప్పుడు అదిరిపోయే లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్కు సంబంధించిన ప్రతి పోస్టరూ ఆకట్టుకుంది. స్టైల్.. ఇంటెన్సిటీ అన్నీ కలగలిసేలా పోస్టర్లు డిజైన్ చేయించాడు కొరటాల. తాజాగా జనతా గ్యారేజ్ ఆడియోకు ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక కొత్త పోస్టర్ వదిలాడు కొరటాల. ఇందులో ఎన్టీఆర్ లుక్ పీక్స్ లో ఉంది. సినిమాలో ఉన్న ఇంటెన్సిటీని ఈ పోస్టర్ ద్వారా చూపించడానికి ట్రై చేస్తున్నట్లున్నాడు కొరటాల. ఈ పోస్టర్ కు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వచ్చింది. ఆడియో ఫంక్షన్ లోపు ఇలాంటి పోస్టర్లు ఇంకొన్ని రిలీజ్ చేస్తారట. ఇలాంటి ఆసక్తి రేకెత్తించే పోస్టర్లు రిలీజ్ చేస్తూ పోతే చాలు.. ఇక సినిమాకు వేరే పబ్లిసిటీ అక్కర్లేదు అన్నట్లుగా ఉంది పరిస్థితి.

English summary

Ntr new poster from Janatha Garage