మలయాళం గ్యారేజ్ లో యంగ్ టైగర్ లేడా?

Ntr not their in Janatha Garage malayalam version

03:09 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Ntr not their in Janatha Garage malayalam version

ఈ అనుమానం ఎందుకు వస్తోందంటే, ఈ పిక్చర్ పోస్టర్ చూస్తే ఇలా అనుమానం రావడం సహజం. వాస్తవానికి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న భారీ విజయం 'జనతా గ్యారేజ్' తో వస్తుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇటు తెలుగులోనే కాదు.. అటు మలయాళంలోనూ మార్కెట్ సృష్టించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తెలుగు మాటేమో కానీ, మలయాళంలో మాత్రం ఎన్టీఆర్ కలలు నెరవేరే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే జనతా గ్యారేజ్ ను మలయాళంలో మోహన్ లాల్ సినిమాగానే ప్రచారం చేస్తున్నారు. అక్కడ వేసిన ఆ సినిమా పోస్టర్లలోనూ మోహన్ లాల్ ప్రముఖంగా కనబడుతున్నాడు.

మలయాళ వెర్షన్ లో ఇప్పటివరకు ఎన్టీఆర్ ను హైలెట్ చేయలేదు. ఈ సినిమా విడుదల తేదీని కన్ఫామ్ చేస్తూ కేరళలో వేసిన పోస్టర్ లో అయితే ఎన్టీఆర్ లేనే లేడు. కేవలం మోహన్ లాల్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మలయాళంలో విడుదల చేస్తోంది, ప్రమోషన్ చేస్తోంది కూడా ఆయన సంస్థే. అయితే ప్రస్తుతానికి ఇదో పెద్ద వ్యూహంలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా కేరళలో ఎన్టీఆర్ కు ఎంత పేరు తీసుకువస్తుందో చూడాలి. గతంలో కేరళ నేపథ్యంలో రూపుదిద్దుకున్న సింహాద్రి సినిమాలో సింగమలైగా యంగ్ టైగర్ ని జక్కన్న చూపించాడు కూడా.

ఇది కూడా చదవండి: భర్త ఆఫీస్ కి వెళ్ళగానే ఆమె ఏం చేసిందో తెలుసా(వీడియో)

ఇది కూడా చదవండి: పెళ్లి కాని జంటలకు కూడా ఆ హోటల్ లో రూమ్స్ ఇస్తారట.. ఎక్కడో తెలుసా?

ఇది కూడా చదవండి: పుట్టబోయే పిల్లలు తెలివిగా, ఆరోగ్యంగా పుట్టాలంటే ఏం చెయ్యాలి?

English summary

Ntr not their in Janatha Garage malayalam version. Janatha Garage movie malayalam posters.