'సంక్రాంతి' బరి నుండి ఎన్టీఆర్‌ ఔట్‌!!

Ntr out from Sankranthi race

03:57 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Ntr out from Sankranthi race

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన మొదటిసారిగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కధానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నామని ఇది వరకే చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని సంక్రాంతికి కాకుండా జనవరి 22న కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి కారణం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు లేటు అవుతుండడం వల్ల వాయిదా వేశారని కొందరు, బాబాయ్‌ చిత్రం డిక్టేటర్‌కి పోటీగా వచ్చే ఇష్టంలేక వాయిదా వేశారని మరి కొందరు చెప్నున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం ఎన్టీఆర్‌ సంక్రాంతి రేసులో నిలువలేకపోయాడు.

English summary

Ntr out from Sankranthi race. Due to post production work Nannaku Prematho movie is postponed.