ఈమెతో ప్రేమలో పడ్డప్పుడు ఎన్టీఆర్ ఫోన్ బిల్ తెలిస్తే షాకౌతారు!

Ntr phone bill when he was talking with Lakshmi Parvathi in phone

12:32 PM ON 9th June, 2016 By Mirchi Vilas

Ntr phone bill when he was talking with Lakshmi Parvathi in phone

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనంటే తెలియని వారు ఉండరు అంటే అది అతిశయోక్తి కాదు. వెండితెర నటుడిగా, ఆంధ్రప్రదేశ్ సిఎం గా ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివి, ఎవరూ చేయలేనివి కూడా. అయితే ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలీదు. ఆయన జీవిత కధే ఒక సినిమా. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లక్ష్మీ పార్వతిని ప్రేమించి వివాహం చేసుకున్న తరువాత ఎన్టీఆర్ రాజకీయ జీవితమే కాదు ఆయన జీవితం కూడా మారిపోయింది.

ఎన్టీఆర్ తో తన ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసినా మరోసారి ఎన్టీఆర్ తో తన ప్రేమ విషయాలను లక్ష్మీ పార్వతి ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టింది. తమ ప్రేమ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయట పెట్టింది. తాము ప్రేమలో ఉన్నప్పుడు ప్రతీ రోజు ఫోన్ లో మాట్లాడుకునే వాళ్లమని, అసలు ఇద్దరికీ టైం తెలిసేది కాదని చెప్పింది. అయితే ఈ విషయంలోనే ఎన్టీఆర్ గారు ఒకసారి నాకో బిల్లు చూపించారని చెప్పింది. అది ఆయన టెలీఫోన్ బిల్లు. నీతో ప్రేమలో పడ్డాక నేను కట్టిన బిల్లెంతో చూడమని చూపించారని చెప్పింది. ఆ బిల్ చూశాక నేను ఆశ్చర్యపోయాను.

ఆ బిల్ అక్షరాలా మూడున్నర లక్షల రూపాయలు(3.5 లక్షలు). ఇప్పుడు లెక్కలతో పోల్చితే అప్పట్లో అది చాలా ఎక్కువ అని వివరించింది. ఎందుకు అంత అయిందంటే రోజూ గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్ళం, అసలు ఫోన్ లేకుండా గడిచేది కాదు అని తమ ప్రేమ ఘ్నాపకాలని మరోసారి గుర్తు చేసుకుంది.

English summary

Ntr phone bill when he was talking with Lakshmi Parvathi in phone