సంక్రాంతి రేసుకి యంగ్ టైగర్ దూరం

Ntr Quits From Sankranthi Race

06:41 PM ON 9th November, 2015 By Mirchi Vilas

Ntr Quits From Sankranthi Race

సంక్రాంతి లాంటి పెద్ద పండక్కి పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అవుతుంటాయి.. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం నాన్నకు ప్రేమతో . ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8న రిలీజ్ అవుతుందని ఈ చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

జనవరి 14న నటసింహం బాలకృష్ణ నటించిన " డిక్టేటర్ " సినిమా సంక్రాంతి రోజున రిలీజ్ అవుతుందని ప్రకటించింది. దీంతో సంక్రాంతికి ఈ ఇద్దరి నందమూరి వారసుల మధ్య యుద్ధం తప్పదని అందరు భావించారు.

సంక్రాంతికి ఒకేసారి ఈ ఇద్దరి నందమూరి హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలియడంతో నందమూరి అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది . ఈ పరిస్థితిని అర్ధం చేసుకున్న ఎన్టీఆర్.... బాబాయ్ సినిమా వస్తుందంటే తన సినిమాని వాయిదా వేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడట . నాన్నకు ప్రేమతో చిత్రానికి దర్శకుడు సుకుమార్ నిర్మాతలతో భారిగానే ఖర్చుపెట్టించాడు. ఈ మొత్తం వసూలు చెయ్యడానికి సినిమాకి కనీసం రెండు వారాలవ్యవధి అవసరం కాబట్టి సంక్రాంతికి సినిమాల హడావిడి అయిపోయాకా రిలీజ్ చేస్తే బాగుంటుందని అని ఎన్టీఆర్ భావిస్తున్నాడని సమాచారం....


English summary

Ntr Quits From Sankranthi Race