ఆఖరికి 50కోట్ల క్లబ్బులోకి

Ntr reached his goal

10:19 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Ntr reached his goal

జనవరి 13న విడుదలైన జూనియర్‌ ఎన్టీఆర్ 'నాన్నకుప్రేమతో' సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సంక్రాంతి కారణంగా తక్కువ ధియేటర్లలో విడుదలైనప్పుటికీ భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమా 11 రోజులు విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ళు 50 కోట్లకు చేరుకున్నాయి. ఎన్టీఆర్ బాద్‌షా, టెంపర్‌ సినిమాలు 50 కోట్లకు దగ్గరకు వచ్చాయి కానీ 50 కోట్లుకి చేరుకోలేకపోయాయి. 'నాన్నకుప్రేమతో' సినిమాతో ఎన్టీఆర్ 50 కోట్ల క్లబ్‌ లో చేరిపోయాడు.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా యూఎస్ లో 2000000 డాలర్లను ఇప్పటికే కొల్లగొట్టింది. 50 కోట్ల క్లబ్‌ లో ఎంటరవ్వడంతో ఎన్టీఆర్ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు.

English summary

Ntr joined in 50 crores club with Nannaku Prematho. with in 11 days Nannaku Prematho earned 50 crores collections at box office. With this Ntr reached his goal to join in 50 crores club.