10 కోట్లు రెమ్యూనరేషన్ తగ్గించిన ఎన్టీఆర్

Ntr reduced 10 crores remmuneration

06:49 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Ntr reduced 10 crores remmuneration

నాన్నకు ప్రేమతో తరువాత ఎన్టీఆర్ కొత్త చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ముహుర్తపు సన్నివేశం ఇటీవలే లాంఛనంగా పూర్తయింది. ఈ చిత్ర ఘాటింగ్ డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ హాట్ న్యూస్ టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే శ్రీమంతుడు చిత్రం తరువాత కొరటాల శివ వేరే హీరోతో చేయాల్సి ఉంది. కాని ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వం అయితే తను తీసుకునే రెమ్యూనరేషన్లో 10 కోట్లు తగ్గిస్తానని మైత్రీ మూవీస్ బేనర్కి భారీ ఆఫర్ ఇచ్చాడట. ఆఫర్ నచ్చడంతో ఆ నిర్మాతలు కొరటాల శివని సంప్రదించి ఎన్టీఆర్కి ఇవ్వబోయే 10 కోట్లు మీకు ఇస్తామని కొరటాలని ఒప్పించారట. దీని బట్టి ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ కన్నా సినిమా నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తుంది.

English summary

Ntr reduced 10 crores remmuneration for his next movie with koratala siva direction.