ఎన్టీఆర్ కాదంటే,  ప్రిన్స్ ఇలా బుక్ అయ్యాడట

NTR Rejected Brahmotsavam Movie

12:26 PM ON 24th May, 2016 By Mirchi Vilas

NTR Rejected Brahmotsavam Movie

ఈ మధ్య వేరే హీరోల సినిమాల విషయంలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. బాక్సాఫీసు దగ్గర మాంచి మార్కులు కొట్టేసిన ఊపిరి చిత్రంలో నాగార్జున తో కల్సి కార్తీ నటించాడు. నటనకు బాగా రెస్పాన్స్ వచ్చింది. అయితే కార్తీ పాత్రకు మొదట్లో ఎన్టీఆర్ ని అనుకున్నారని , ఆవిధంగా మంచి సినిమా మిస్ అయ్యాడని చాలామంది కామెంట్లు చేసారు. ఇక ఇప్పుడు మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. రిలీజ్, వీకెండ్ (మూడురోజులు) కలిసి దాదాపు 40 కోట్లకు పైగానే రావాల్సిన ఈ సినిమా, కేవలం 26 కోట్ల మాత్రమే రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ర్టాలు-18.86 కోట్లు, కర్ణాటక- 2.70, ఓవర్సీస్- 4.14, రెస్టాఫ్ ఇండియా-80 లక్షలు మాత్రమే రాబట్టినట్టు సమాచారం. వచ్చేవారం వసూళ్లను పెద్దగా ఆశించలేమని బయ్యర్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:ఐపీఎల్ గురించి మీకు తెలియని విషయాలు

కాగా వాస్తవానికి ఈ ఫిల్మ్ ఫస్ట్ ఎన్టీఆర్‌తో చేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ అనుకున్నాడట. సరిగ్గా అదే సమయంలో ‘నాన్నకు ప్రేమతో’ స్క్రిప్ట్ కూడా జూనియర్ వింటున్నాడు. చివరకు ఏ సినిమా చేయ్యాలో తర్జనభర్జన పడి ఫైనల్‌గా లెక్కల మాస్టారు వైపు ఎన్టీఆర్ మళ్లాడు. దీంతో ‘బ్రహ్మోత్సవం’ను ఎన్టీఆర్ మిస్సయ్యాడు. కానీ ప్రిన్స్ ఓకే చేశాడు. ఇప్పుడిదే మహేష్‌కు కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను మిగిల్చింది. ఈ లెక్కన ఎన్టీఆర్ జస్ట్ మిస్.. ప్రిన్స్ బుక్డ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి. మొత్తానికి ఓ హిట్ సినిమాలో చేయనందుకు మిస్ అయిన ఎన్టీఆర్ ఇప్పుడు ఓ ప్లాప్ సినిమా మిస్ అవ్వడం మంచి చేసిందని అంటున్నారు. ఇక అసలు ఇలాంటి ఫిల్మ్‌కు మహేష్‌బాబు ఎలా ఓకే అన్నాడు? అంటూ అభిమానులు సైతం గుర్రుగా వున్నారట. మరి ఇకనుంచి ప్రిన్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది తప్పదని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:అప్పుడు నగ్న సెల్ఫీతో షాకిచ్చి.. ఇప్పుడు నన్ గా మారిపోయింది..

ఇవి కూడా చదవండి:క్లాస్ రూమ్ లో స్టూడెంట్ తో సెక్స్ చేస్తూ దొరికేసిన టీచర్(వీడియో)

English summary

Super Star Mahesh Babu's recent film was Brahmotsavam and this movie got flop talk at the box office and first Director Srikanth Addala said this story to Junior but Junior Rejected this movie and later it was made with Srikanth Addala.