ఎన్టీఆర్ గా మార్చింది ఎన్టీఆరే

NTR Reveals The Secret Of His Name

10:18 AM ON 25th January, 2016 By Mirchi Vilas

NTR Reveals The Secret Of  His Name

జూనియర్ ఎన్టిఆర్ నిత్యం తాత ఎన్టిఆర్ స్మరణ చేస్తుంటాడు. దీనికి కారణం లేకపోలేదు. జూనియర్ అసలు పేరు, అదేనండి అమ్మా నాన్న పెట్టిన పేరు ‘తారక్‌ రామ్‌’. కానీ ఈ పేరుని ఎన్టిఆర్ గా మార్చింది మాత్రం నటరత్న ఎన్టిఆర్. అలా పేరు మార్చేటప్పటికి ఎన్టిఆర్ వయ్యస్సు 11 ఏళ్ళు. ఇంతకీ పేరు ఎలా మారిందంటే, ఓ రోజు ఎన్టిఆర్ తల్లి శాలిని తాతయ్య పిలుస్తున్నారంటూ,పెందరాడే లేపేసి కారులో పంపడం జరిగిందట. తాతయ్య రూం లోకి వెళ్ళిన జూనియర్ ని పేరేమిటని తాతయ్య అడగడం , తారక్ రామ్ అని జూనియర్ చెప్పడం అయిందట. ఇది విన్న నటరత్న ఎన్టిఆర్ వెంటనే హరికృష్ణ ను పిలిచి, వీడి పేరును నందమూరి తారక రామారావు అని మార్చండి’ అంటూ ఆజ్ఞ వేసేయ్యడం, అప్పటి నుంచి 'తారక్‌ రామ్‌' ఎన్టీఆర్‌ అయ్యాడు జూనియర్. మొదట్లో జూనియర్ ఎన్టిఆర్ అని టైటిల్స్ లో వేసేవారు. అందరూ అలానే పిలిచేవారు. కానీ రాను రాను ఎన్టిఆర్ గా వ్యవహారంలోకి వచ్చాడు. తనను ఎన్టిఆర్ అనే వ్యహరించాలని ఏకంగా ఓ సారి జూనియర్ చెప్పడం కూడా అయింది. అదండీ ఎన్టిఆర్ సంగతి ...

English summary

Junior NTR was actually named by " Tarak Ram" and later Senior NTR was called him and ordered Junior NTR father to change Tarak Ram name as Nandamoori Taraka Rama Rao(NTR). This was said by Junior NTR