ఆ డబ్బు నెల రోజులు లెక్క పెట్టాడా 

NTR Says About His First Movie Remuneration

11:30 AM ON 25th January, 2016 By Mirchi Vilas

NTR Says About His First Movie Remuneration

కేవలం మూడున్నర లక్షల రూపాయలను నెల రోజుల పాటు అదేపనిగా లెక్కపెట్టాడట. అంటే లెక్కలు రావనా? కాదు అంత సొమ్ము ఒకేసారి సంపాదించిన ఆనందంలోనట. ఓసారి వివరాలలోకి వెళితే, 2001లో ఉషాకిరణ్‌ మూవీస్‌ వారి ‘నిన్ను చూడాలని’ వచ్చింది. అందులో ఎన్టీఆర్ హీరో. అయితే తొలి పారితోషికంగా రూ.3.5 లక్షలు ఎన్టీఆర్ చేతుల్లో పెట్టారట. ఇంకేముంది, ఒకేసారి అన్ని డబ్బులు చూశాక, చేతులు ఒణకడం మొదలెట్టాయట. పైగా స్వశక్తి తో సంపాదించిన సోమ్మాయే.

అందుకే ఇంటికెళ్లి తలుపులేసుకొని మరీ ఎన్టీఆర్ ఆ సొమ్ము లెక్కపెట్టాడట. అలా ఓ సారి లెక్కేస్తే పర్వాలేదు కానీ, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా నెల రోజులూ అదే పని అట. ఎవరి కంటా పడకుండా ఇంట్లో మూల మూలల్లో ఆ సొమ్ము దాచి మరీ రోజూ లేక్కపెట్టేవాడట. ఇక అందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేస్తే ఒట్టు. పైగా ఎవరైనా కాజేస్తారేమో ననే భయం కూడా వుండేదట. ఇంతకీ నెల తర్వాత సొమ్ము ఏం చేసాడో తెల్సా, వాళ్ళమ్మ చేతుల్లో పెట్టే శాడట. ఎందుకంటే ఎంత సంపాదించినా అమ్మ కోసమే కదా అన్పించడం వలెనేనట. ఇంతకీ ఇది 15 ఏళ్ళ క్రితం నాటి మాట. మరి ఇప్పుడు పెళ్లైంది , పిల్లాడు పుట్టాడు .... మరి ఇప్పుడు సంపాదించే సొమ్ము అమ్మ చేతిలో పెడుతున్నడా, లేక భార్య చేతిలోనా? ఇద్దరి చేతుల్లోనా ?

English summary

Tollywood Young Tiger Junior NTR says that his first remuneration was 3.5 lakhs for his first movie Ninnu Chudalani Movie.He says that he counted his first ever remuneration for almost one month and later he gave his money for his mother