కార్ ను అమ్మకానికి పెడుతున్న ఎన్టీఆర్

Ntr selling his Range Rover car

02:49 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Ntr selling his Range Rover car

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన రేంజ్ రోవర్ కారును అమ్మేయబోతున్నాడట.. అవునా? నిజమా? అని మీరు ఆశ్చర్యపోక మానరు. ఎందుకంటే అంత పెద్ద స్టార్ హీరోకి ఉన్న‌ట్టుండి కారు అమ్మేయాల్సినంత అవ‌స‌రం ఎందుకొచ్చింద‌ని అనుకోవచ్చు. అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆలస్యం చెయ్యకుండా విషయంలోకి వెళ్లిపోదాం.. స్వతహాగా ఎన్టీఆర్‌కు కాస్త కార్ల పిచ్చితో పాటు ల‌క్కీ నెంబ‌ర్ల పిచ్చి కూడా ఎక్కువే. 9999 నెంబ‌ర్ ద‌క్కించుకునేందుకు ఎన్టీఆర్ ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తాడు. ఇక 2011లో పెళ్లి అయిన‌ప్ప‌టి నుండి ఎన్టీఆర్ రేంజ్ రోవర్ కారును వాడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ కారు త‌న‌కు పెద్దగా అచ్చిరాకపోవడంతో ఎన్టీఆర్ దానిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. ఎన్టీఆర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డికైనా వెళ్లాలంటే రేంజ్ రోవ‌ర్ కారులోనే వెళ్లేవాడు. ప్రస్తుతం దాన్ని పూర్తిగా గ్యారేజ్ కు పరిమితం చేసి తను మరో కొత్త కారు బీఎమ్‌డబ్ల్యూ కొనుక్కుని దానిలోనే తిరుగుతున్నాడు. ఇక ఆ రేంజ్ రోవర్ కారుని ఇంట్లో ఉంచుకోవడం కూడా ఇష్టంలేక దాన్ని ఎవరికైనా అమ్మేయాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నాడట. మరి ఆ కారును ఎవరు కొంటారో చూడాలి. ఎన్టీఆర్ అభిమాని ఎవరైనా కొనొచ్చని భావిస్తున్నరంతా..

English summary

Ntr selling his Range Rover car. Young Tiger Ntr selling his Range Rover car.