చిరంజీవే నా స్ఫూర్తి, దైవం: ఎన్టీఆర్

Ntr shocking comments about Chiranjeevi

11:56 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Ntr shocking comments about Chiranjeevi

మా సినీ అవార్డ్స్ వేడుకలో ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా టెంపర్ సినిమాకు ఉతమ నటుడు అవార్డును ఎన్టీఆర్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్నేళ్ళు వచ్చినా ఎన్ని తరాలు మారినా మాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని మొదట పేరు చెప్పగానే అభిమానులు ఈలలు వేస్తూ సభను హోరెత్తించారు. ఆ తర్వాత బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ పేర్లను చెప్పాడు. ఈ అవార్డు అందించిన స్టార్ ఇండియా సినిమా అవార్డ్స్ వారికి నా ధన్యవాదములు. చిరంజీవి గారు, నాగార్జున బాబాయ్ ల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.

ఎన్నేళ్ళు మేమిక్కడ ఉన్నా మా అందరికీ ఇన్స్ పిరేషన్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు. నందమూరి తారకరామారావుగారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళందరి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి. అవి అలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అని యంగ్ టైగర్ అన్నాడు. టెంపర్ సినిమా విషయంలో పూరీ జగన్నాధ్ కు కృతఘ్నతలు చెప్పిన ఎన్టీఆర్ సొంతంగా కధలు రాయగల పూరీ జగన్నాధ్ తన మాటకు విలువిచ్చి రచయత వక్కంతం వంశీ కధను సినిమాగా మలిచాడని పూరీకి ఎన్టీఆర్ కితాబిచ్చాడు. మీ జీవితంలో జరిగిన గొప్ప మార్పు ఏంటని యాంకర్ సుమ ప్రశ్నించగా నా కొడుకు అని సమాధానమిచ్చాడు యంగ్ టైగర్.

English summary

Ntr shocking comments about Chiranjeevi