గొంతు విప్పిన ఎన్టీఆర్‌!!

Ntr sings a song in Nannaku Prematho..

05:31 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Ntr sings a song in Nannaku Prematho..

సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కధానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నాన్నకుప్రేమతో' ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ని ఎప్పుడూ చూడని విధంగా చాలా స్టైలిష్‌ గా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో దేవిశ్రీ ఎన్టీఆర్‌ తో ఒక పాట పాడించడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తల వచ్చాయన్న విషయం తెలిసిందే. ఆ వార్తలు నిజమే, అవను ఎన్టీఆర్‌ చేత దేవీశ్రీ ఒక పాట పాడించారు. ఎన్టీఆర్‌ ఇది వరకు దేవీశ్రీ సంగీతంలోనే అదుర్స్‌ చిత్రంలో ఒక పాట పాడారు అది సూపర్‌హిట్‌.

స్వతహాగా మంచి సింగరైన ఎన్టీఆర్‌తో నాన్నకుప్రేమతో లో ఒకపాట పాడించాలని భావించాడట దేవీశ్రీ. ఆ పాటని హైదరాబాద్‌లోని మణిశర్మ స్టూడియోలో రికార్డు చేశారు. ఎన్టీఆర్‌ పాడిన ఈ పాటే చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందట. మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

English summary

Ntr sings a song in Nannaku Prematho.. and the music composed by Devisri Prasad. Movie directed by Sukumar.