ఎన్టీఆర్ తనయుడు అప్పుడే జిమ్ కా! 

Ntr son Abhay going to gym

12:53 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Ntr son Abhay going to gym

ఫీట్ నెస్ బాడీ కోసమో, చురుకుదనం కోసమో గానీ అప్పుడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ జిమ్ కి వెళుతున్నాడు, అక్కడ సందడి చేస్తున్నాడు. నిజమా అభయ్ పుట్టి రెండేళ్ళు కూడా కాకుండా అప్పుడే జిమ్ కి వెళ్ళిపోయాడెందుకని అనుకుంటున్నారా? అయితే ఎందుకో తెలుసు కోవాల్సిందే. తండ్రి జిమ్ చేస్తుంటే చూడటానికి ఎన్టీఆర్ కూడా అభయ్ వెళుతున్నాడట. తీరా అక్కడ జిమ్ పరికరాలు కొత్తగా అనిపించడంతో వాటితో కొద్దిసేపు అభయ్ రామ్ ఆటాడుకున్నాడట. లాస్ట్ ఇయర్ జులై 22న ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న అభయ్ ఇప్పుడు తన తండ్రి ఎన్టీఆర్ తో ముంబైలో షికారు చేస్తున్నాడు.

తన తండ్రి జిమ్ చేసే సమయంలో అక్కడికి వెళ్ళిన అభయ్ కి అక్కడి వాతావరణం అంతగా కొత్తగా అనిపించి ఉంటుంది. అందుకే ఆ జిమ్ పరికరాలతో ఆడుకోవాలని ట్రై చేసినా, అవి కదలక పోవడంతో కొద్దిగా నిరుత్సాహపడినట్లు కనిపించాడట. ఇక ఎన్టీఆర్-కొరటాల శివల 'జనతాగ్యారేజ్' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమాను అనుకున్న సమయానికి థియేటర్లో వేసేస్తామని నిర్మాతలు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

1/6 Pages

English summary

Ntr son Abhay going to gym with his father in Mumbai. And he is playing with gym equipments while his father doing gym.