జనతా గ్యారేజ్ లో అభయ్?

NTR Son Abhay Ram Visits Janatha Garage Set

10:03 AM ON 10th May, 2016 By Mirchi Vilas

NTR Son Abhay Ram Visits Janatha Garage Set

హీరోల కొడుకులు చిన్నప్పుడే కెమెరా ముందుకు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే అగ్రహీరోలుగా వున్నవాళ్లలో చాలా మంది చిన్నప్పుడు తెరమీద తళ్ళుక్కున మెరిసినవారే. ఇప్పుడు ఆలాంటిదే జరిగిందా? ఓసారి వివరాల్లోకి వెళ్దాం. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జనతా గ్యారేజ్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ఓ సెట్ లో చిత్రీకరణ జరుగుతోంది. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని దర్శకుడు చెప్పగానే అక్కడందరూ ఎన్టీఆర్ కెమెరా ముందుకొస్తాడని ఊహించారు. కానీ అతని ముద్దుల తనయుడు అభయ్ రామ్ బుడి బుడి అడుగులు వేస్తూ వచ్చాడు. దీంతో సెట్లో అందరికళ్లూ అభయ్ రామ్ పైకి మళ్లాయి. దర్శకుడు సైతం మెగాఫోన్ వదిలిపెట్టి అభయ్ రాముడి సందడిని చూసేందుకని లేచి నిలుచున్నాడు. జనతా గ్యారేజ్ సెట్లో చోటు చేసుకొందీ దృశ్యం.

ఇవి కూడా చదవండి: రోబో 2.0 లో గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు

ఈ సెట్ కి సోమవారం ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్ వచ్చాడు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి తన తనయుడిని వెంట తీసుకొని సెట్ కి రావడంతో సెట్లో సందడి వాతావరణం నెలకొంది. అభయ్ చాలాసేపు సెట్ లో ప్రాపర్టీల్ని పట్టుకొని వాటిని తదేకంగా పరిశీలిస్తూ సందడి చేశాడట. అభయ్ రామ్ జనతా గ్యారేజ్ సెట్ కి రావడం ఇదే తొలిసారి. దీంతో ఎన్టీఆర్ తన తనయుడితో కలిసి దిగిన ఫొటోల్ని ఆన్ లైన్లో పెట్టారు. జనతా గ్యారేజ్ సినిమా అభయ్ రామ్ కి ఓ తీపి జ్ఞాపకంగా మారబోతోంది. ఈ సినిమా ప్రారంభానికి కూడా అభయ్ రామ్ హాజరయ్యాడు. ఇప్పుడు సెట్ కి కూడా వచ్చాడు. భవిష్యత్తులో ఓ తీపిజ్ఞాపకంలా ఇది మిగిలుతుంది కదా.

ఇవి కూడా చదవండి: పోస్టర్ తోనే హీటెక్కిస్తున్న నాని హీరోయిన్

ఇవి కూడా చదవండి: ఆస్కార్ విజేత తో మంచు లక్ష్మి హాలీవుడ్ సినిమా

English summary

Junior NTR was presently acting in Janatha Garage Movie Under the the direction of Mirchi movie fame Koratala Shiva. Yesterday Junior NTR's Son Abhay Ram Visited Janatha Garage Set . NTR's Wife also visited Janatha Garage Set