కొరటాలకు ఎన్టీఆర్ భారీ గిఫ్ట్..!

Ntr special gift for Koratala Siva

01:09 PM ON 24th September, 2016 By Mirchi Vilas

Ntr special gift for Koratala Siva

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కలెక్షన్ల పరంగా టాలీవుడ్ టాప్ త్రీ మూవీస్ లో స్థానాన్ని కూడా దక్కించుకుంది. ఈ విజయంతో ఎన్టీఆర్ ఇమేజ్ బాగా పెరిగింది అందుకే బిజినెస్ పెంచుకోవాలని చూస్తున్నాడు. తమిళ మార్కెట్టుపై కూడా దృష్టి పెట్టినట్టు త్వరలో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రాలను ప్లాన్ చేసుకునే ఉద్ధేశంలో ఆయన ఉన్నాడట. జనతా గ్యారేజ్ విజయ ఆనందాన్ని కొరటాల శివతో పంచుకోవాలని భావిస్తున్నాడట అందుకే ఖరీదైన డూప్లెక్స్ హౌజ్ ని దర్శకులు కొరటాల శివకు ఇవ్వాలనుకుంటున్నాడట ఎన్టీఆర్.

'శ్రీమంతుడు' వంటి భారీ హిట్ లభించడంతో మహేష్ కొరటాల శివకు యాభై లక్షల విలువ గల ఆడి కారుని గిఫ్ట్ గా ఇచ్చిన విషయం తెలిసిందే. గతకొంత కాలంగా ఎన్టీఆర్ హిట్ ఎదురుచూస్తున్నాడు, ఆ హిట్ జనతా గ్యారేజ్ తో లభించడంతో ఎన్టీఆర్ కొరటాలకు ఇంటిని గిఫ్ట్ గా ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రోజూ ఒంటిపై బట్టలు లేకుండా పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఇది కూడా చదవండి: పైసా ఖర్చు లేకుండా మీకు పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా తెలుసుకోండిలా..

ఇది కూడా చదవండి: గరుడపురాణం ప్రకారం జీవితమంతా సంతోషంగా ఉండాలంటే ఈ 3 తప్పులు చెయ్యకూడదట!

English summary

Ntr special gift for Koratala Siva. Young Tiger Ntr giving Duplex House to Janatha Garage director Koratala Siva for Janatha Garage super hit.