ఆ నెంబర్ కోసం 10న్నర లక్షలు పోశాడు

NTR Spends 10 Lakhs For Car Number

09:55 AM ON 18th April, 2016 By Mirchi Vilas

NTR Spends 10 Lakhs For Car Number

ఫలానే నెంబర్ సెంటిమెంట్ గా కావాలంటే, ఎంత డబ్బైనా వెచ్చించాలి మరి. అయితే ఓ కారు ఖరీదు అంత సొమ్ము ఓ నెంబర్ కోసం వెచ్చిస్తే ... అవును 10న్నర లక్షలు పోస్తే, నిక్షేపం లాంటి కారు వచ్చేస్తుంది. ఇంతకీ విషయం ఏమంటే, జూనియర్ ఎన్టీఆర్‌కి ఫ్యాన్సీ నెంబర్లంటే మహామోజు. లక్కీ నెంబర్ల కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడు. కోటీ 21 లక్షలు పెట్టి తాను ఇటీవల కొన్న బిఎండబ్ల్యు కారుకు టీఎస్ 09 ఈఎల్ 9999 నెంబరు కావాలని ఈ హీరో బిడ్ వేశాడు. అయితే ఇదే నెంబరు కావాలని ఇంకా చాలామంది కోరడంతో హైదరాబాద్ రవాణా కార్యాలయం అధికారులు శనివారం ఆన్‌లైన్ వేలం వేశారు. ఈ వేలంలో ఎన్టీఆర్ రూ.10.5 లక్షలకు ఈ నెంబర్ సొంతం చేసుకున్నాడు. ఈ ఆఫీసు హిస్టరీలోనే ఇది రికార్డ్ అట. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ తీరిక చేసుకుని ఫ్యాన్సీ నెంబర్ కోసం జరిగిన ఆన్‌లైన్ వేలంలో పాల్గొనడం విశేషంగా చెప్పుకుంటున్నారు. కాగా రెండో బిడ్‌లో ఓ నిర్మాణ సంస్థ రూ.6 లక్షలు ఖర్చు పెట్టి ఓ వాహనం కోసం లక్కీ నెంబర్ పొందింది. ఇక టీఎస్ ఈఎల్ 0009, 0006 తదితర నెంబర్ల వేలం ద్వారా రవాణా శాఖకు ఒక్కరోజే 20 లక్షల 31 వేల 950 రూపాయల ఆదాయం లభించిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

ఓవర్ స్పీడ్ తో బుక్కైన మంత్రి సుజనా తనయుడు

ఫేస్‌బుక్‌లో ఇలాంటి ఫోటో పెట్టారో అంతే

జబర్దస్త్ నుంచి రోజా ఔట్! ఆమె స్ధానంలో మరో హీరోయిన్

English summary

NTR has Spend 10.5 lakh for the fancy number for his car. Recently NTR purchased BMW car worth 1.2 crores ammount. He spends 10.5 lakh for "TS09 9999" number. This was the highest ever in the history. Presently Junior NTR was acting in Janata Garage Movie Under the direction of Koratala Shiva.