ఇకనుంచి అవి లేవంట.. ఎన్టీఆర్ సంచలన నిర్ణయం!

Ntr takes sensation decision for his movies

01:06 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Ntr takes sensation decision for his movies

ఓ స్టార్ హీరో సినిమా వస్తోందంటే ఆ హీరో అభిమానులకు పండగే. విడుదలకు కొన్ని రోజుల ముందే హంగామా మొదలైపోతుంది. విడుదలకు ముందు రోజు రాత్రే బెనిఫిట్ షోలు ప్రారంభమైపోతాయి. ఎంత డబ్బు వెచ్చించి అయినా ఆ షోలు చూడడానికి వీరాభిమానులు పరితపించిపోతుంటారు. అదే అదునుగా భావించి బెనిఫిట్ షో టికెట్ రేట్లను డబుల్, ట్రిపుల్ కాదు.. ఏకంగా పదిరెట్లు పెంచేసి మరీ నిర్వాహకులు అమ్మేసుకుంటారు. దీనికి అడ్డూ అదుపు లేదు. అయితే ఇటీవలి కాలంలో బెనిఫిట్ షోలు వేసిన ప్రతీ సినిమాకూ నెగిటీవ్ టాకే వినబడుతోంది. ఇలాంటి బెనిఫిట్ షోల వల్ల సినిమాలకు మంచి కంటే చెడే ఎక్కువగా జరగుతోందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నాడట. తాజాగా బెనిఫిట్ షో దెబ్బ రుచి చూశాడు కూడా.

ఇటీవల భారీ అంచనాతో విడుదలైన జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోలు చూసిన అందరూ ఫ్లాపనే అన్నారు. ఉదయం ఆరుగంటలకే రివ్యూలు రాసేసి ఫ్లాపని తేల్చేశారు. డివైడ్ టాక్ కొంప ముంచుతుందని అనుకున్నారు. అయితే అదృష్టవశాత్తూ సినిమా నిలబడిందనుకోండి. అయితే బెనిఫిట్ షోల వల్ల నెగిటీవ్ టాక్ ఎక్కువగా వ్యాపిస్తోందని, అది తర్వాత కలెక్షన్ల మీద తీవ్ర ప్రభావం చూపెడుతోందని ఎన్టీఆర్ గుర్తించాడట. బెనిఫిట్ షోల వల్ల వ్యాపించిన నెగిటీవ్ టాక్ లేకుంటే జనతా గ్యారేజ్ మరో రేంజ్ లో ఉండేదని అనుకుంటున్నాడట. అందుకే ఇకపై తన సినిమాలకు బెనిఫిట్ షోలు వేయనివ్వకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడట. యంగ్ టైగర్ నిర్ణయం సరే, మిగిలిన స్టార్స్ ఏం చేస్తారో చూడాలి.

ఇది కూడా చదవండి: అక్కడ ఆడవారి కోర్కెలు తీర్చడానికి మగవారు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: శృంగారం భోజనానికి ముందు మంచిదా లేక తర్వాత మంచిదా?

ఇది కూడా చదవండి: ఆడాళ్ళని తడిమేస్తూ.. మగాళ్లని కుమ్మేసే దొంగబాబా(వీడియో)

English summary

Ntr takes sensation decision for his movies. Ntr takes shocking decision for his next movies. Their is no benefit shows for his movies.