ఎన్టీఆర్‌ షాకింగ్ నిర్ణయం

Ntr takes shocking decision for Garuda movie

11:36 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Ntr takes shocking decision for Garuda movie

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా సెన్సేషన్‌ 'నాన్నకుప్రేమతో'. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో మంచి జోష్‌ మీద ఉన్నాడు. అదే ఊపులోనే ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్‌' చిత్రానికి అంగీకరించాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సెట్స్‌ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్‌ ఆ తరువాత పూరి జగన్నాధ్‌ చిత్రంలో చేస్తాడు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక ఎన్టీఆర్‌ మూడు సంవత్సరాలు పాటు ప్రేక్షకులకి దూరంగా ఉంటాడట. అవును ఇది అక్షరాలా నిజం. అయితే ఈ నిర్ణయానికి ఒక కారణం కూడా ఉంది. దర్శకధీర రాజమౌళి 'గరుడ' అనే చిత్రం తెరకెక్కించబోతాడని వార్తలు వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్‌ హీరోగా నటించబోతున్నాడని వార్తలు హల్‌చల్‌ చేశాయి.

ఇప్పుడు ఆ వార్తలు నిజమవుతున్నాయి. అవును ప్రస్తుతం రాజమౌళి 'బాహుబలి -2' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఘాటింగ్‌ అయిపోయాక రాజమౌళి తరువాత తెరకెక్కించేది 'గరుడ' చిత్రమేనట. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ అప్పుడే కథని కూడా సిద్ధం చేసేస్తున్నాడు. ఒక హాలీవుడ్‌ నిర్మణ సంస్థ 1000 కోట్ల బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రం కోసమే ఎన్టీఆర్‌ దాదాపు మూడు సంవత్సరాలు పాటు డేట్స్‌ ఇచ్చేశాడట. ఈ చిత్రానికి సంబంధించి రాజమౌళి తనయుడు 'కార్తికేయ' అప్పుడే ప్రీ-ప్రొడక్షన్‌ పనులను మొదలు పెట్టేశాడని సమాచారం. ఇందులో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఒక ముఖ్యపాత్రలో నటించబోతున్నాడట.

ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా 2017, మే 20 న ప్రారంభించి, ఏప్రిల్‌ 5వ తేదీ నుండి రెగ్యులర్‌గా షూటింగ్‌ మొదలు పెడతారని సమాచారం. ఇదే గనుక నిజమైతే ఎన్టీఆర్‌ మూడు సంవత్సరాలు పాటు తెరకు దూరంగా ఉండటం ఇదే మొదటిసారి.

English summary

Young Tiger Ntr takes shocking decision for Garuda movie. He gave 3 years call sheets for Garuda movie.