'జనతా' లో ఎన్టీఆర్‌ పాత్ర లీక్‌

NTR To Act As IIT Student In Janata Garage

10:23 AM ON 26th February, 2016 By Mirchi Vilas

NTR To Act As IIT Student In Janata Garage

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'నాన్నకుప్రేమతో' చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్‌'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండగా ఆయనకి సతీమణిగా అలనాటి హీరోయిన్‌ దేవయాని నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్ర ఏంటో లీకైంది. అదేంటంటే ఎన్టీఆర్‌ ఇందులో ఒక ఐఐటి స్టూడెంట్‌గా కనిపించనున్నాడట. అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్‌ తన బాడీ లాంగ్వేజ్‌ని మార్చుకోబోతున్నాడని సమాచారం. అంతేకాదు ఈ చిత్రం షూటింగ్‌ ని ఇండియాలోని ఒక టాప్‌ ఐఐటి కాలేజ్‌లో చిత్రీకరించనున్నారని సమాచారం. ఎన్టీఆర్‌ ఇదివరకు 'స్టూడెంట్‌ నెం.1' చిత్రంలో కూడా స్టూడెంట్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించనున్నాడు.

English summary

After the success of Nannaku premato movie NTR was acting in Janata Garage movie under the direction of Koratala Shiva.Recently according to an update of this movie that in this movie NTR was acting as an IIT student.