‘నేతాజీ’రోల్ లో ఎన్టీఆర్!

NTR To Act As Netaji In Puri Jagannadh Movie

10:46 AM ON 11th May, 2016 By Mirchi Vilas

NTR To Act As Netaji In Puri Jagannadh Movie

ఇటు కళ్యాణ్‌రామ్‌..అటు ఎన్టీఆర్‌కు ఒకే రోజు స్టోరీలను వినిపించి డేట్స్ తీసుకున్న పూరీ జగన్నాధ్, యంగ్ టైగర్‌తో చేయబోయేది ‘నేతాజీ’ ఫిల్మ్ అని టాక్ వినిపిస్తోంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ ఫిల్మ్ ఏంటి? ఏ డైరెక్టర్‌తో మూవ్ అవుతున్నాడు? ఇవే ప్రశ్నలు చాలామంది జూనియర్ అభిమానులను వెంటాడుతుండగా, తాజాగా ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ ‘నేతాజీ’గా రాబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ మూవీ గురించి ఎన్టీఆర్ బర్త్ డే రోజున (ఈనెల 20న) డైరెక్టర్ స్టేట్‌మెంట్ ఇస్తాడనే మాటా వినిపిస్తోంది. పేరు ఓకే.. ఇదిలా వుండగా మహేష్‌తో ‘జన గణ మన’ చిత్రాన్ని చేస్తునట్లు కొద్దిరోజుల కిందట ప్రకటన ఇచ్చిన విషయం తెల్సిందే! మరోవైపు ఈనెల 25 నుండి కళ్యాణ్‌రామ్‌తో కొత్త చిత్రాన్ని సెట్స్‌పై తీసుకెళ్లనున్నాడట పూరీ! నేతాజీ అంటే ఆయనకు తగ్గట్టుగానే మూవీ వుంటుందా? లేదా అందులోని ఏదైనా దేశభక్తి కోణం వుంటుందా? ఇలాంటి ప్రశ్నలకు క్లారిటీ రావాలంటే 20 వరకు వెయిట్ చేయాల్సిందే!.

ఇవి కుడా చదవండి:హైదరాబాద్ క్లబ్ లో యువకుడి రేప్ ఆ పై హత్య

ఇవి కుడా చదవండి:అబ్బా , 8 నెలలుగా రెస్ట్ లేదంటున్న సమంత

ఇవి కుడా చదవండి:ప్రాణం తీసిన ఫుడ్‌ ఎలర్జీ...

English summary

Young Tiger Junior NTR to act as Netaji in Director Puri Jagannadh movie. Recently Puri Jagannadh was announced that he was going to make film with Nandamuri Kalyan Ram and he now going to announced a movie with Junior NTR.